AP Cabinet Decisions: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. 42 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం
ఏడాదిలోగా అన్ని రెవెన్యూ సమస్యలు పరీష్కరించాలని మరోసారి తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఉంటే ఎన్నిసార్లైనా నాతో మాట్లాడొచ్చని ఆయన స్పష్టం చేశారు.

AP Cabinet Decisions: ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. 42 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో చేపడుతున్న మలివిడత భూ సమీకరణపై మంత్రివర్గంలో చర్చించారు. తొలి విడత భూ సమీకరణకు వర్తించిన నిబంధనలే మలివిడత భూ సమీకరణకు వర్తింప చేయాలని నిర్ణయం తీసుకుననారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలు ఇంచార్జ్ మంత్రి నేతృత్వంలో జిల్లా స్థాయిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఏడాదిలోగా అన్ని రెవెన్యూ సమస్యలు పరీష్కరించాలని మరోసారి తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఉంటే ఎన్నిసార్లైనా నాతో మాట్లాడొచ్చని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యల సాకుతో సమస్య దాటవేత ధోరణి సరికాదన్నారు చంద్రబాబు. రెవెన్యూ సమస్యలపై తాను తరచూ అడుగుతూనే ఉంటానని గట్టిగా చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
కూటమి ఏడాది విజయాలను ఎమ్మెల్యేలు జూలై 1 నుంచి ఇంటింటికీ తీసుకెళ్లే కార్యాచరణ రూపొందించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతీ నియోజవర్గ కేంద్రంతో పాటు మండలంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కాంటీన్ల నిర్వహణ, పర్యవేక్షణ, విరాళాలకు ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.