ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. వరుసగా కేంద్ర పెద్దలతో సమావేశం

కేంద్ర ఉపరితల రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం, రోడ్ల అభివృద్ధిపై చర్చించారు. ఏపీలో పెండింగ్ లో ఉన్న పలు హైవేల నిర్మాణంపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగింది.

ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. వరుసగా కేంద్ర పెద్దలతో సమావేశం

Cm Chandrababu Delhi Tour : హస్తినలో సీఎం చంద్రబాబు టూర్ బిజీబిజీగా కొనసాగుతోంది. ప్రధాని మోదీతో భేటీ అనంతరం వరుసగా కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. ఏపీలో పెండింగ్ అంశాలను ఆయనకు విన్నవించారు. అంతకుముందు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వీరి భేటీ సుమారు 40 నిమిషాల పాటు కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను మోదీకి వివరించారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోదీకి నివేదిక ఇచ్చారు చంద్రబాబు.

అటు కేంద్ర ఉపరితల రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం, రోడ్ల అభివృద్ధిపై చర్చించారు. ఏపీలో పెండింగ్ లో ఉన్న పలు హైవేల నిర్మాణంపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగింది.

ఆ తర్వాత కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తోనూ సీఎం సమావేశం అయ్యారు. సుమారు అరగంట పాటు వీరి భేటీ కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించారు.

ఢిల్లీలో ఉన్న చంద్రబాబు.. ఇప్పటివరకు ప్రధాని మోదీతో పాటు నలుగురు కేంద్ర మంత్రులను కలిశారు. ఉదయం పీయూష్ గోయల్ తో ఆయన భేటీ అయ్యారు. అనంతరం ప్రధాని మోదీతో సుమారు 40 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై విజ్ఞాపనలు అందించారు ప్రధానికి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి.. రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు, బకాయిలు, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యత కల్పించే విధంగా వివిధ అంశాలకు నిధులు కేటాయించాలని కూడా విజ్ఞాపనలు అందించారు చంద్రబాబు.

Also Read : కూటమి ప్రభుత్వం టార్గెట్ నెంబర్ 1 ఆయనేనట..! సీఎం, డిప్యూటీ సీఎం, మాజీ సీఎం ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరి