Jagan On Cabinet Expansion : వైసీపీ ప్లీనరీ తర్వాతే.. కేబినెట్ విస్తరణ-సీఎం జగన్
కేబినెట్ విస్తరణపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ప్లీనరీ తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు.

Jagan On Cabinet Expansion
Jagan On Cabinet Expansion : కేబినెట్ విస్తరణపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ప్లీనరీ తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు. జూలై 8న ప్లీనరీ ఉంటుందని జగన్ తెలిపారు. పదవులు పోయాయని మంత్రులకు అసంతృప్తి వద్దని జగన్ అన్నారు. మంత్రి పదవి నుంచి తొలగించిన వారికి పార్టీ బాధ్యతలు, జిల్లా అధ్యక్ష పదవులు, రీజినల్ కో-ఆర్డినేటర్లుగా బాధ్యతలు ఇస్తామన్నారు.
ఏప్రిల్ 2 నుంచి గడప గడపకు వైసీపీ కార్యక్రమం ఉంటుందని జగన్ తెలిపారు. 8 నెలల పాటు గడప గడపకు వైసీపీ కార్యక్రమం ఉంటుందన్నారు. సరిగా పని చేయని వారికి ఈసారి టికెట్లు ఇచ్చేది లేదని జగన్ తేల్చి చెప్పారు. మళ్లీ వచ్చి తనను టికెట్ అడగొద్దని చెప్పారు.(Jagan On Cabinet Expansion)
ప్రస్తుత కేబినెట్ ఏర్పడి మూడేళ్లు అవుతున్న నేపథ్యంలో.. మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని జగన్ నిర్ణయించారు. సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి.. కొత్త వారిని మంత్రులుగా నియమించాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో కేబినెట్ విస్తరణ ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్నారు.
మంత్రివర్గ విస్తరణపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. ఎవరి పదవి ఊడుతుందో.. ఎవరికి కొత్తగా పదవి దక్కతుందో అనే ఉత్కంఠ నెలకొంది. కొద్దిమంది మినహా మిగతా కేబినెట్ ను మొత్తం ప్రక్షాళన చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కొత్త జిల్లాల ప్రతిపాదికన.. కొత్తవారికి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని సమాచారం. సామాజిక సమీకరణాలు సహా అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ కేబినెట్ ను విస్తరించాల్సి ఉంది. అందుకే సీఎం జగన్.. కేబినెట్ కూర్పుపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. కాగా, మంత్రిపదవులు రాని వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం జగన్ చెప్పారు.
AP Cabinet : ఎన్నికల మూడ్లోకి ఏపీ ప్రభుత్వం..15న వైసీపీఎల్పీ భేటీ
సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. కీలక అంశాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు జగన్. పార్టీ వ్యవహారాల విషయంలో కీలక మార్పులు చేస్తూ జగన్ ప్రకటన చేశారు. కొత్త జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించనున్నారు. పార్టీ రీజనల్ ఇంచార్జ్ ల విషయంలో పలు మార్పులు చేయనున్నారు. వచ్చే రెండేళ్లు పార్టీ రాజకీయ కార్యాచరణపై ప్రకటన చేయనున్నారు జగన్. సర్వే రిపోర్టుల ఆధారంగా పనితీరుపై ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు సీఎం జగన్.
ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చాలామంది ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి.. ఈరోజు నుంచి ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లోనే ఉండాలన్నారు. ప్రతిరోజూ నివేదికను తెప్పించుకుని సమీక్షిస్తానని సీఎం జగన్ చెప్పారు. ఇప్పటివరకు ఏయే నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో సమగ్ర నివేదిక తన దగ్గర ఉందన్నారు జగన్. కొంతమంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తున్నాయని, వారంతా వాటికి సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు.
కష్టపడి పని చేయకపోతే ఇబ్బంది పడతారని హెచ్చరించారు జగన్. మీ ప్రతి కదలిక ఈరోజు నుంచి నమోదవుతుందని ఎమ్మెల్యేలతో చెప్పారు. గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు సంపాదించే దిశగా నేను పని చేస్తున్నా అని జగన్ చెప్పారు. మీరందరూ అంతకంటే ఎక్కువ పని చేయాలన్నారు. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గాన్ని కలియతిరగాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పికొట్టాలని ఎమ్మెల్యేలకు సూచించారు జగన్.