CM Jagan : 99 శాతం హామీలు అమలు చేశాం, మన ప్రభుత్వం చేసిన అభివృద్ధే మనల్ని గెలిపిస్తుంది : సీఎం జగన్

గడప గడప కార్యక్రమం గురించి కొందరు ఎమ్మెల్యేలు నన్ను తిట్టుకొని ఉంటారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగన్ ఇప్పుడు అదే ఎమ్మెల్యే ల మొహాల్లో చిరునవ్వు కనిపిస్తుందన్నారు. మన ప్రభుత్వం చేసిన మంచి ప్రతీ ఇంట్లో, ప్రతీ గ్రామాల్లో కనిపిస్తుందన్నారు.

CM Jagan : 99 శాతం హామీలు అమలు చేశాం, మన ప్రభుత్వం చేసిన అభివృద్ధే మనల్ని గెలిపిస్తుంది : సీఎం జగన్

CM Jagan

CM Jagan in ysrcp meeting : విజయవాడలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్ పార్టీ క్యాడర్ కు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ఫిబ్రవరిలో వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు. మార్చి,ఏప్రిల్ (2024)లో ఎన్నికలకు సన్నద్ధం అంటూ స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో మన పొత్తు ప్రజలతోనే ఉంటుందని ప్రకటించారు. గత ఎన్నికల్లో ప్రకటించిన మ్యానిఫెస్టో 99 శాతం అమలు చేశామని తెలిపారు. దీంట్లో భాగంగా 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించామని..వైసీపీ లా నిరంతరం ప్రజల్లో ఉన్న పార్టీ ఇంకొకటి లేదంటూ చెప్పుకొచ్చారు.

గడప గడప కార్యక్రమం గురించి కొందరు ఎమ్మెల్యేలు నన్ను తిట్టుకొని ఉంటారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగన్ ఇప్పుడు అదే ఎమ్మెల్యే ల మొహాల్లో చిరునవ్వు కనిపిస్తుందన్నారు. మన ప్రభుత్వం చేసిన మంచి ప్రతీ ఇంట్లో, ప్రతీ గ్రామాల్లో కనిపిస్తుందన్నారు. ఇంత మంచి చేసిన మనకి వై నాట్ 175 సాధ్యమే అంటూ ధీమా వ్యక్తం చేస్తు..క్యాడర్ లో జోష్ ను కలిగించారు.చంద్రబాబు ప్రజల్లో ఉన్నా.. జైలులో ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదు అంటూ ఎధ్దేవా చేశారు. విశ్వసనీయత లేని చంద్రబాబు ఎక్కడ ఉన్నా ఒక్కటేనంటూ విమర్శించారు.

AP High court : చంద్రబాబుకు షాకిచ్చిన హైకోర్టు, ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత

చంద్రబాబును కక్ష సాధింపు తో అరెస్టు చెయ్యలేదని.. నాకు ఎలాంటి కక్ష లేదు..అరెస్టు జరిగినప్పుడు నేను ఇండియాలో లేను లండన్ లో ఉన్నాను అంటూ వివరించారు.స్కిల్ స్కాం లో కేంద్రం దర్యాప్తు సంస్థలు మొదట నోటీసులు ఇచ్చాయి..కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇచ్చినప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం..ఈ స్కాం లో దొరక్కుండా ఆనాడు cbi రాష్ట్రంలోకి రాకుండా జీవో ఇచ్చారని అన్నారు.కేసులో ఆధారాలు ఉన్నాయి కనుకే కోర్టు రిమాండ్ కి పంపింది..చంద్రబాబు అవినీతి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి అంటూ క్యాడర్ కు దిశానిర్ధేశం చేశారు.

ప్రతిపక్షాలు పొత్తుల కోసం వెంపర్లడుతున్నాయి ..రెండు సున్నాలు కలిసినా నాలుగు సున్నాలు కలిసినా వచ్చేది పెద్ద సున్నా అంటూ సెటైర్లు వేశారు జగన్.పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టీ 15 ఏళ్లు అయ్యింది అభ్యర్థులు లేరు.. జెండా మోసే వాడు లేడు..చంద్రబాబు మోసాల్లో.. దోపిడీ లో పవన్ పార్టనర్ అంటూ విమర్శలు సంధించారు.చనిపోయాక కూడా ప్రతీ ఇంట్లో ఫోటో ఉండాలి అది రాజకీయమంటే..జగన్ ఎవరితో పొత్తు పెట్టుకోడు..మీ ఇంట్లో మంచి జరిగిందా.. లేదా అదే కొలమానంగా చూడండి..ప్రజలకు మనం చేసిన మంచే మన దైర్యం అంటూ క్యాడర్ తో ఉత్సాహాన్ని నింపారు.