పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదివితే తెలుగు జాతి అంతరించిపోతుందా? మరి వాళ్ల పిల్లలకు వర్తించదా?
పేదింటి పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే గొప్ప కార్యక్రమం జగనన్న విద్యాదీవెన అని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.

CM Jagan
CM Jagan : పేదింటి పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే గొప్ప కార్యక్రమం జగనన్న విద్యాదీవెన అని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబర్ – డిసెంబర్ – 2023 త్రైమాసికానికి సంబంధించి నిధులు విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పామర్రులో జరిగిన సభలో పాల్గొని ప్రసంగించారు. గత 57నెలలుగా త్రైమాసికం పూర్తైన వెంటనే క్రమం తప్పకుండా జగనన్న విద్యాదీవెన కొనసాగిస్తున్నామని చెప్పారు. 9,44,666 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ కడుతున్నామని, మనం అధికారంలోకి వచ్చాక ఇంకా ఎక్కువ మంది చదువుకునేలా ప్రమాణాలను పెంచామని అన్నారు. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించాలని సూచించండి.. 93శాతం మందికి జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన ఇస్తున్నామని చెప్పారు. మీ ఫీజులు మీరే కట్టుకోండి అని గత ప్రభుత్వ విధానాలకు స్వస్తి పలికామని, పిల్లలు ఇబ్బందులు పడకూడదని త్రైమాసికం పూర్తయిన వెంటనే ఫీజులు చెల్లిస్తున్నామని సీఎం జగన్ అన్నారు.
Also Read : YCP Operation Akarsh : టీడీపీ అసమ్మతి నేతలపై వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్..!
అక్టోబర్ నుంచి మూడు నెలలకు 9లక్షల 45 వేల మంది విద్యార్ధులకు 708 కోట్లు పిల్లలు, పిల్లల తల్లుల జాయింట్ అకౌంట్ లోకి నిధులు జమ చేస్తున్నామని, అలా.. 57నెలల్లో 29 లక్షల 66 వేల మంది విద్యార్ధులకు విద్యాదీవెన కింద 12609 కోట్లు జమ చేశామని సీఎం జగన్ అన్నారు. ఏప్రిల్ లో వసతి దేవెన కింద 11 వేల కోట్లు విడుదల చేస్తున్నాం.. విద్యాదీవెన, వసతి దీవెన కింద ఇప్పటిదాకా 18వేల కోట్లపైనే విడుదల చేశామని చెప్పారు. విద్యా రంగంలో అనేక మార్పులు తెచ్చాం.. పిల్లలు బాగుండాలని, పేదరికం నుంచి బయటకు రావాలని పథకాలకు 73వేల కోట్లు 57నెలల్లో ఖర్చు చేశామని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 57నెలల్లో విద్యా రంగంలో ఎలాంటి మార్పులు తెచ్చామో, ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ప్రతిపక్కరూ గమనించాని సూచించారు.
మన పిల్లలు పోటీ పడేది ప్రపంచంతో. గత 30 ఏళ్ల కిందట ఇప్పటికీ ఎంతలా మారుతున్నాయో అందరం చేస్తున్నాం. అక్షరాలు నేర్చుకుంటే చదువులు కాదు కావాల్సింది.. క్వాలిటీ చదువులు. ప్రపంచంలో పెద్ద కంపెనీల్లో మన పిల్లలు ఉద్యోగాలు పొందాలని విద్యారంగంలో మార్పులు తెస్తున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. పోటీ ప్రపంచంలో మన పిల్లలు లీడర్లుగా ఎదగాలి. నాడు నేడుతో ప్రభుత్వ బడులన్నీ మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియంతెస్తే చంద్రబాబు, దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తుంది. ప్రభుత్వ బడులు బాగు పడాలనుకోవడం తప్పా అని జగన్ ప్రశ్నించారు. విద్యారంగంలో పేదలకు ఎదగాలని మార్పు తెస్తుంటే ఇంతమందితో యుద్ధం చేయాల్సి వస్తుందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మనల్ని విమర్శిస్తున్న వాళ్ల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో మీరే అడగాలి. వాళ్ల పిల్లలు, మనవళ్లు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. పేదవారు ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు జాతి అంతరించిపోతుందని అంటున్నారు. వాళ్ల పిల్లల చేతిలో టాబ్ లు ఉండొచ్చు.. మన పిల్లల చేతిలో టాబ్ లు ఉంటే ఏవేవో చూస్తూ చెడిపోతున్నారని యాగీ చేస్తున్నారు. పెత్తందారీ నిదర్శనాలు మన ముందే కనిపిస్తున్నాయి. విద్యా రంగంలో వారికి మనకి యుద్ధం జరుగుతుంది. పెత్తం దారులకు, పేదలకు మధ్య జరుగుతుంది క్లాస్ వార్. మీ అన్నగా మీ తరుపున విద్యా రంగంలో అనేక సంస్కరణలు, మార్పులు తెచ్చాం. ఈ విప్లవమే అడుగులు పడకపోతే కూలీల పిల్లలు కూలీలుగా మిగిలిపోతారు. పిల్లలు బాగుపడాలనే ఈ తిరుగుబాటు చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి అన్నారు.