CM Jagan : యుక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థులను సురక్షితంగా తీసుకురండి-కేంద్రానికి సీఎం జగన్ లేఖ

యుక్రెయిన్‌లో ఉంటున్న ఏపీ విద్యార్థుల‌ను సుర‌క్షితంగా రాష్ట్రానికి తీసుకురావాల‌ని విదేశాంగ మంత్రిని లేఖలో కోరారు జగన్. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు.

CM Jagan : యుక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థులను సురక్షితంగా తీసుకురండి-కేంద్రానికి సీఎం జగన్ లేఖ

Jagan

Updated On : February 23, 2022 / 9:32 PM IST

CM Jagan : ర‌ష్యా, యుక్రెయిన్‌ మ‌ధ్య యుద్ధ వాతావర‌ణం నెల‌కొంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రికత్తలు ప్రపంచదేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో యుక్రెయిన్‌లో ఉంటున్న భార‌తీయుల‌ను సుర‌క్షితంగా దేశానికి త‌ర‌లించే ప‌నిని కేంద్రం ఇప్ప‌టికే చేప‌ట్టింది. కాగా, యుక్రెయిన్‌లో చ‌దువుకుంటున్న ఏపీ విద్యార్థులను సుర‌క్షితంగా రాష్ట్రానికి తీసుకురావ‌డానికి ఏపీ సీఎం జ‌గ‌న్ చ‌ర్య‌లు చేపట్టారు. ఇందులో భాగంగా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు.

Russia-Ukraine War : రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం వస్తే.. భారత్‌లో ఏయే వస్తువుల ధరలు పెరగొచ్చుంటే?

యుక్రెయిన్‌లో ఉంటున్న ఏపీ విద్యార్థుల‌ను సుర‌క్షితంగా రాష్ట్రానికి తీసుకురావాల‌ని విదేశాంగ మంత్రిని లేఖలో కోరారు జగన్. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విష‌యంలో ఏపీ నుంచి ఎలాంటి స‌హ‌కారం అందించ‌డానికైనా తాము సిద్ధంగా ఉన్నామ‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. యుక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థుల‌ను త‌క్ష‌ణ‌మే సుర‌క్షితంగా వారి స్వ‌స్థ‌లాల‌కు చేర్చాల‌ని జ‌గ‌న్ కోరారు.

‘‘యుక్రెయిన్ లో ఉంటున్న వారు తిరిగి రాష్ట్రానికి రావడానికి సాయం కోరుతున్నారు. ఏపీ ప్రభుత్వం నిత్యం కేంద్ర విదేశాంగశాఖతో టచ్‌లో ఉంది. వాళ్లని వెనక్కి తీసుకురావడంలో కావాల్సిన సహకారం కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌, ఇక్కడి సీఎంవో అందుబాటులో ఉంటుంది. యుక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థులతో ప్రభుత్వం టచ్‌లో ఉంది. కేంద్రం సూచించిన మేరకు వారంతా వెనక్కి రావడానికి మా వంతు సహకారం అందిస్తున్నాం’’ అని సీఎం జగన్‌ చెప్పారు.

Russia : యుక్రెయిన్‌పై పంజా విసురుతున్న రష్యా.. ఆర్థిక ఆంక్షలను పట్టించుకోని పుతిన్

రష్యా- యుక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. యుక‍్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా బలగాలను మోహరించి సైనిక విన్యాసాలు చేస్తోంది. ఈ క్రమంలో రష్యా వ్యవహార శైలిపై ప్రపంచ దేశాలు ఆందోళనతో పాటుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

అగ్రరాజ్యం అమెరికా.. రష్యాను హెచ్చరిస్తూ ఆర్థిక ఆంక్షలు విధించింది. రష్యాను కబ్జాదారు అని మండిపడ్డారు. ఇప్పటి నుంచి రష్యా చర్యకు ప్రతి చర్య ఉంటుందని హెచ్చరించారు. రష్యాకు చెందిన రెండు అతిపెద్ద ఆర్థిక సంస్థలు.. వెబ్‌, సైనిక బ్యాంకుపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్టు బైడెన్‌ తెలిపారు.

యుక్రెయిన్‌లో రెబెల్స్‌ అధీనంలోని రెండు ప్రాంతాలకు స్వతంత్ర హోదా ఇస్తున్నట్టు ప్రకటించిన రష్యా, వాటిలోకి భారీగా సైన్యాన్ని నడిపి అగ్నికి మరింత ఆజ్యం పోసింది. తాము ప్రకటించిన స్వతంత్ర హోదా రెబల్స్‌ నుంచి యుక్రెయిన్‌ స్వాధీనం చేసుకున్న ప్రాంతాలకూ వర్తిస్తుందని ప్రకటించి, రష్యా సేనలు అక్కడిదాకా చొచ్చుకెళ్తాయని చెప్పకనే చెప్పింది. ఈ పరిణామాలపై అమెరికా, యూరప్‌తో పాటు పలు ప్రపంచ దేశాలు మండిపడ్డాయి.

అంతర్జాతీయ ఒప్పందాలను, మర్యాదలను రష్యా తుంగలో తొక్కిందంటూ దుయ్యబట్టాయి. యూఎన్ఓ భద్రతా మండలి రష్యా చర్యలను తీవ్రంగా ఖండించింది. కఠినమైన ఆంక్షలకు సిద్ధమవుతున్నట్టు అమెరికా, యూరప్‌ ప్రకటించాయి. రష్యా స్వతంత్ర హోదా ప్రకటించిన ప్రాంతాలతో వర్తక వాణిజ్యాలపై అమెరికా నిషేధం విధించింది. ఇంగ్లండ్‌ ఏకంగా ఐదు రష్యా బ్యాంకులపై ఆంక్షలు విధించింది. తమ దేశంలోని ముగ్గురు రష్యా కుబేరుల ఆస్తులను స్తంభింపజేస్తున్నట్టు ప్రకటించింది. ఇది ఆరంభం మాత్రమేనని, మున్ముందు నాటో సభ్య దేశాలతో కలిసి కనీవిని ఎరగని ఆంక్షలతో విరుచుకుపడతామని రష్యాను హెచ్చరించింది. రష్యా దూకుడును అడ్డుకునేలా యుక్రెయిన్‌కు అన్నివిధాలా సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. మొత్తానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత తీవ్రమైన యుద్ధ సంక్షోభం యూరప్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.