CM Jagan: సీఎం జగన్ రెండ్రోజుల కడప పర్యటన

సీఎం జగన్ రెండ్రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 15, 16 తేదీల్లో ఒంటిమిట్టలో జరిగే కోదండరాముని కళ్యాణ మహోత్సవంలో పాల్గొననున్నారు. 15వ తేదీ ఒంటిమిట్టలోని కార్యక్రమం.

CM Jagan: సీఎం జగన్ రెండ్రోజుల కడప పర్యటన

Cm Jagan

Updated On : April 13, 2022 / 9:31 AM IST

CM Jagan: సీఎం జగన్ రెండ్రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 15, 16 తేదీల్లో ఒంటిమిట్టలో జరిగే కోదండరాముని కళ్యాణ మహోత్సవంలో పాల్గొననున్నారు. 15వ తేదీ ఒంటిమిట్టలోని కార్యక్రమం అనంతరం.. అదే రోజు రాత్రి కడపకు చేరుకుని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో ఉంటారు.

16వ తేదీ ఉదయం 9 గంటలకు ఎన్జీవో కాలనీలో ఐఏఎస్ అధికారి మౌర్య వివాహానికి హాజరవుతారు. అనంతరం ఆదిత్య కళ్యాణమండపంలో మేయర్ సురేష్ బాబు కుమార్తె ముందస్తు వివాహా వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం కడప విమానాశ్రయం చేరుకుని కర్నూలు జిల్లాకు వెళ్లనున్నారు సీఎం.

మరోవైపు కొత్త మంత్రులతో ఏపీ కేబినెట్ నూతన ఉత్సాహంతో కనిపిస్తుంది. మంగళవారంతో దాదాపు మంత్రులు అందరీ ప్రమాణ స్వీకారాలు పూర్తి అయిపోయి కొత్త బాధ్యతలు అందుకున్నారు.

Read Also: సీఎం జగన్ దగ్గర ఉండేవి రెండే టీములు – కొడాలి నాని