AP CM Jagan : నేను ఉన్నా..రెండో రోజు వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా....

Jagan Flood
AP Flood Affected Areas : వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా 2021, డిసెంబర్ 03వ తేదీ శుక్రవారం ఉదయం తిరుపతిలోని వరద ప్రాంతాలలో జగన్ పర్యటించనున్నారు. తిరుపతిలోని కృష్ణానగర్, ఆటోనగర్, తిరుచానూరులో ఆయన పర్యటన కొనసాగనుంది. మధ్యాహ్నం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు సీఎం జగన్. గురువారం రాత్రి ఆయన తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో బస చేశారు.
Read More : Electricity Charges : తెలంగాణలో త్వరలో కరెంటు చార్జీల పెంపు ?
గురువారం కడప జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలోని పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు. వరద సృష్టించిన బీభత్సాన్ని.. సీఎం పర్యవేక్షించారు. ఎంత నష్టం జరిగింది.. ఎన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయన్న విషయాలు.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే.. బాధితులకు అందుతున్న సాయం పైనా ఆరా తీశారు. వర్షాలు, వరదలతో.. స్థానికంగా ఇబ్బందులెదుర్కొన్న వాళ్ల బాధలు తానే స్వయంగా విన్నారు జగన్. అందుకనుగుణంగా.. చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
Read More : Jubilee Hills : మేనల్లుడితో అత్త వివాహేతర సంబంధం..అనంతరం బ్లాక్ మెయిల్
పర్యటనకు ముందు జొవాద్ తుపానుపై రివ్యూ నిర్వహించారు సీఎం జగన్. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు.. అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. లోతట్టు, ముంపు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉత్తరాంధ్రలో.. తుపాను సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యతను.. ముగ్గురు సీనియర్ అధికారులకు అప్పగించారు.