AP CM Jagan: నేడు అవనిగడ్డలో సీఎం జగన్ పర్యటన.. భారీ బహిరంగ సభ.. షెడ్యూల్ ఇలా..

ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి గురువారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటించనున్నారు. అవనిగడ్డ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.

AP CM Jagan: నేడు అవనిగడ్డలో సీఎం జగన్ పర్యటన.. భారీ బహిరంగ సభ.. షెడ్యూల్ ఇలా..

AP Cm Jagan

Updated On : October 20, 2022 / 7:10 AM IST

AP CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి గురువారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటించనున్నారు. అవనిగడ్డ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. నిషేధిత భూముల సమస్యను వై.ఎస్. జగన్ పరిష్కరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 35,600 ఎకరాల భూములకు చెందిన 22వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ క్రమంలో గురువారం అవనిగడ్డలో జరిగే బహిరంగ సభలో 22ఏ(1) కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను జగన్ రైతులకు అందజేస్తారు.

CM Jagan : దోచుకో, పంచుకో, తినుకో వ్యవహారం చంద్రబాబుది-సీఎం జగన్ ఫైర్

గురువారం ఉదయం 10.10 గంటలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో బయలు దేరి 10.30 గంటలకు వేకనూరు హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 10.45 గంటలకు వేకనూరులో బయలుదేరి 10.55 గంటలకు అవనిగడ్డ సభా స్థలికి చేరుకుంటారు. 10.55 నుంచి 11.05 గంటల వరకు బహిరంగ సభవద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం నిషేధిత భూముల సమస్య పరిష్కారంతో లబ్ధిపొందిన 20 మంది రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖీ మాట్లాడి వారితో గ్రూపు ఫొటో దిగుతారు. అనంతరం సభావేదికకు వెళ్లి రైతులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1,350 మంది పోలీసులు బందోబస్తులో పాల్గోనున్నారు. సీఎం బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలకు ప్రత్యేకంగా 500 బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. బస్సు దిగిన తరువాత సభాస్థలికి చేరుకోవటానికి ఆటోలనుసైతం సిద్ధంగా ఉంచారు.