Attacked On TDP Office : టీడీపీ ఆఫీస్‌‌పై దాడి ఘటనపై ఫిర్యాదు.. ఎన్ని దౌర్జన్యాలు చేసినా భయపడేదిలేదన్న టీడీపీ నేతలు

గన్నవరం నియోజకవర్గం ప్రసాదంపాడులోని టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై ఆ పార్టీ నేత నరసయ్య ఫిర్యాదు చేశారు. పార్టీ మారలేదని ఎమ్మెల్యే వంశీ తనను టార్గెట్ చేసి ఇటువంటి దాడులకు తెగబడుతున్నారంటూ మండిపడ్డారు.

Attacked On TDP Office : టీడీపీ ఆఫీస్‌‌పై దాడి ఘటనపై ఫిర్యాదు.. ఎన్ని దౌర్జన్యాలు చేసినా భయపడేదిలేదన్న టీడీపీ నేతలు

Updated On : December 16, 2023 / 2:38 PM IST

Attacked On Gannavaram TDP Office :  గన్నవరం నియోజకవర్గం ప్రసాదంపాడులోని టీడీపీ నేత నరసయ్య స్వంత స్థలంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై కొంతమంది దుండగులు దాడి చేశారు. కార్లు, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై నరసయ్య సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి తన ఇంటిలో పార్కింగ్ చేసి ఉన్న కార్ల అద్దాలు ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు. అనంతరం నరసయ్య మాట్లాడుతు..తనపై గన్నవరం ఎమ్మెల్యే వంశీ కట్టారని అందుకే దాడికి పాల్పడ్డారని విమర్శించారు. ఆయనతో పాటు తాను పార్టీ మారలేదని కక్ష కట్టి ఇలా దాడులకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. తనను టార్గెట్ చేసి వంశీ దాడులకు దిగుతున్నారని.. ఎన్ని దాడులు చేసినా..ఎంత బెదిరించినా తాను భయపడేది లేదని తేల్చి చెప్పారు.

ఈ దాడి ఘటనపై టిడిపి గన్నవరం ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతు..ఇలా దాడులు చేయటం పిరికిపందలు చేసే పనులని ఎద్దేవా చేశారు. తనపై దాడి చేసినా..కార్యకర్తలపై దాడి చేసినా ఒక్కటే అని ఏ కార్యకర్తపై దాడి చేసినా..తనపై చేసినట్లుగా భావిస్తానని అన్నారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయటానికి వెళ్లామని కానీ దారిలోతనే తమను పోలీసులు అడ్డుకోవటం సరికాదన్నారు.

TDP Office Attacked : గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ ఆఫీస్ పై దుండగుల దాడి.. కార్లు, ఫర్నీచర్ ధ్వంసం

ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులకు చేయడం హేయమైన చర్య అంటూ మండిపడ్డారు. దాడులకు పాల్పడినవారిని పోలీసులు రెండురోజుల్లో పట్టుకుంటారని భావిస్తున్నానని అన్నారు. టీడీపీ పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇటువంటి దాడులకు పాల్పడతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గన్నవరం టిడిపి కంచుకోట..గన్నవరంలో టిడిపి గెలుపు నల్లేరు మీద నడకే అంటూ ధీమా వ్యక్తం చేశారు. తాను వైసీపీ లో ఉన్న సమయంలో గానీ ఎప్పుడు గానీ ఎవరిమీద తప్పుడు కేసులు పెట్టలేదు..,దాడులు చేయలేదని అన్నారు. తనది అటువంటి సంస్కృతి కాదని కానీ ఇలా దాడులకు తెగబటం అనేది చాలా హేయమైన చర్య అంటూ మండిపడ్డారు.