Guntur Old Age Mother : కన్న తల్లిని కాలితో తన్నిన కొడుకు-అదుపులోకి తీసుకున్న పోలీసులు

వృధ్ధాప్యంలో ఉన్న తల్లి  బాగోగులు  జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఒక కన్నకొడుకు తల్లిని కాలితో తన్ని,నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటు చేసుకుంది.

Guntur Old Age Mother : కన్న తల్లిని కాలితో తన్నిన కొడుకు-అదుపులోకి తీసుకున్న పోలీసులు

Tadepalli police

Updated On : February 18, 2022 / 8:59 PM IST

Guntur Old Age Mother :  వృధ్ధాప్యంలో ఉన్న తల్లి  బాగోగులు  జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఒక కన్నకొడుకు తల్లిని కాలితో తన్ని,నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటు చేసుకుంది.

బ్రహ్మనందపురంలో నాగమణి అనే వృధ్ధురాలు తన కొడుకు,కోడలుతో నివసిస్తోంది. ఇటీవల ఆస్తుల విషయమై ఇంట్లో  గొడవ జరిగింది. నాగమణి పేరు మీద ఉన్న ఆస్తిని కొడుకు తనపేర రాయమని కోరాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు.  అప్పటి నుంచి కొడుకు, కోడలు ఆమెను ఆస్తికోసం వేధించసాగారు.

ఆమె ఆస్తి ఇవ్వకపోవటంతో ఆమెను కొడుకు ఇంటినుంచి గెంటివేశాడు. ఆమెకు ఎవరూ సహాయం చేయక పోవటంతో నిరాశ్రయురాలైంది. ఇటీవల ఆమె తన ఇంటి వద్దకు రాగా కొడుకు ఆమెపట్ల కర్కశంగా ప్రవర్తించాడు. ఈతతంగం గతకొద్ది రోజులుగా సాగుతోంది.
Also Read : Fake Certificate Racket : నకిలీ సర్టిఫికెట్‌లు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్
ఇదంతా చూసిన ఇరుగు పొరుగు వారు వృధ్ధురాలి కొడుకుతో గొడవ పెట్టకోవటం ఇష్టంలేక అతడికి తెలియకుండా సెల్‌ఫోన్‌తో  అతడు తల్లితో ప్రవర్తించిన తీరును  వీడియో తీశారు. ఆ వీడియోను తాడేపల్లి పోలీసులకు చూపించారు. వీడియో చూసిన పోలీసులు ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.