ఏపీలో కొనసాగుతున్న కరోనా కేసులు

ఏపీలో కొనసాగుతున్న కరోనా కేసులు

Updated On : August 30, 2020 / 8:18 PM IST

రాష్ట్రంలో గత 24గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలిలా ఉన్నాయి. మొత్తం 63వేల 77మంది శాంపిల్స్ ను పరీక్షించారు. ఇందులో 10వేల 603మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయింది. కోవిడ్ వల్ల నెల్లూరులో పద్నాలుగు మంది, చిత్తూరులో పన్నెండు మంది, కడపలో తొమ్మిది మంది, అనంతపురంలో ఏడుగురు, పశ్చిమగోదావరిలో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఆరుగురు, శ్రీకాకుళం ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, కర్నూల్ లో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, ప్రకాశంలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు మరణించారు.

గడిచిన 24గంటల్లో 9వేల 67మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. ఆదివారం ఉదయం వరకూ 36లక్షల 66వేల 422మంది శాంపుల్స్ పరీక్షించారు.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు:

గడిచిన 24గంటల్లో నమోదైన వివరాలు:


ఆరోగ్యసేతు యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండిలా:

  • గూగుల్ ప్లే స్టోర్‌లో ఆరోగ్యసేతు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి.
    యాప్ వాడేందుకు మీ ఫోన్ నెంబర్ ద్వారా రిజిష్టర్ చేసుకోండి.
    మీ పేరు, వయస్సు, ఇతర వివరాలు ఇచ్చి యాప్ ఉపయోగించుకోవచ్చు.