COVID-19 AP : 24 గంటల్లో 2 వేల 209 కేసులు, 22 మంది మృతి

ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 2 వేల 209 మందికి కరోనా సోకింది. 22 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

COVID-19 AP : 24 గంటల్లో 2 వేల 209 కేసులు, 22 మంది మృతి

Ap Corona

Updated On : August 6, 2021 / 8:57 PM IST

COVID-19 Cases : ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 2 వేల 209 మందికి కరోనా సోకింది. 22 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో 13 వేల 490 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 1,896 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని, నేటి వరకు రాష్ట్రంలో 2,50,27,770 శాంపిల్స్ చేసినట్లు వెల్లడించింది.

Read More : Inter Religion Marriage: ముస్లిం.. ముస్లిమేతరుల మధ్య పెళ్లి చట్టబద్ధం కాదు – ఆల్ ఇండియా ముస్లిం బోర్డ్

ఏ జిల్లాలో ఎంత మంది ?

కృష్ణా జిల్లాలో ఆరుగురు, గుంటూరులో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పు గోదావరి, వైఎస్ఆర్ కడపలో, శ్రీకాకుళం, విశాఖపట్టణంలో, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారని వెల్లడించింది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం 19,75,455 పాజిటివ్ కేసులకు గాను..19 లక్షల 41 వేల 372 మంది డిశ్చార్జ్ కాగా..13 వేల 490 మంది మృతి చెందారని..ప్రస్తుతం 20 వేల 593 మంది చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

Read More : Pavitrostavam : ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు..ఎప్పటి నుంచి అంటే

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 34. చిత్తూరు 382. ఈస్ట్ గోదావరి 438. గుంటూరు 183. వైఎస్ఆర్ కడప 65. కృష్ణా 243. కర్నూలు 27. నెల్లూరు 307. ప్రకాశం 184. శ్రీకాకుళం 41. విశాఖపట్టణం 135. విజయనగరం 30. వెస్ట్ గోదావరి 140. మొత్తం : 2,209