Corona Death : విశాఖలో అమానవీయం.. కరోనా అనుమానంతో వృద్ధురాలికి తిండి కూడా పెట్టని కుటుంబం, ఆకలితో అలమటించి మృతి

విశాఖ జిల్లా పద్మనాభ మండలంలోని మద్దిలో దారుణం వెలుగుచూసింది. కరోనా కష్టకాలంలో ఓ వృద్దురాలు ఆకలితో అలమటించి ప్రాణాలు విడిచింది. కుటుంబసభ్యులు కరోనా అనుమానంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చగా, వారం రోజులుగా వృద్దురాలిని పట్టించుకునే వారు

Corona Death : విశాఖలో అమానవీయం.. కరోనా అనుమానంతో వృద్ధురాలికి తిండి కూడా పెట్టని కుటుంబం, ఆకలితో అలమటించి మృతి

Corona Death

Updated On : April 26, 2021 / 12:31 PM IST

Corona Death : విశాఖ జిల్లా పద్మనాభ మండలంలోని మద్దిలో దారుణం వెలుగుచూసింది. కరోనా కష్టకాలంలో ఓ వృద్దురాలు ఆకలితో అలమటించి ప్రాణాలు విడిచింది. కుటుంబసభ్యులు కరోనా అనుమానంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చగా, వారం రోజులుగా వృద్దురాలిని పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో ఆమె ఆకలితో అలమటించి మరణించింది.

కాగా, కరోనా భయంతో మృతదేహాన్ని తీసేందుకు కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రంగంలోకి అధికారులు మున్సిపల్ సిబ్బంది సాయంతో వృద్దురాలి మృతదేహాన్ని తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. కరోనా మహమ్మారి మనషుల్లోని మానవత్వాన్ని చంపేస్తోంది. కరుణ, జాలి, దయ లేని రాయిలా మారుస్తోంది.