Corona In AP : ఏపీలో కరోనా భయం భయం, భారీగా పెరిగిన కేసులు..మరణాలు

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత సంవత్సరం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో..అలాంటి పరిస్థితులే మళ్లీ కనిపిస్తున్నాయి.

Corona In AP : ఏపీలో కరోనా భయం భయం, భారీగా పెరిగిన కేసులు..మరణాలు

andhra pradesh

Updated On : April 18, 2021 / 7:26 PM IST

 COVID-19 Cases : ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత సంవత్సరం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో..అలాంటి పరిస్థితులే మళ్లీ కనిపిస్తున్నాయి. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 6 వేల 582 మందికి కరోనా సోకింది. 22 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 35 వేల 222 శాంపిల్స్ పరీక్షించారు. చిత్తూరులో ఐదుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, నెల్లూరులో నలుగురు, కర్నూలులో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, విశాఖపట్టణంలో, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

గడిచిన 24 గంటల్లో 2 వేల 343 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 1,56,77,992 శాంపిల్స్ పరీక్షించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 9 లక్షల 59 వేల 142 పాజిటివ్ కేసులకు గాను..9 లక్షల 07 వేల 046 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఈ వైరస్ కారణంగా…7 వేల 410 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 44 వేల 686గా ఉంది.

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 305. చిత్తూరు 1171. ఈస్ట్ గోదావరి 100. గుంటూరు 804. వైఎస్ఆర్ కడప 203. కృష్ణా 465. కర్నూలు 729. నెల్లూరు 597. ప్రకాశం 314. శ్రీకాకుళం 912. విశాఖపట్టణం 551. విజయనగరం 349. వెస్ట్ గోదావరి 82. మొత్తం : 6582.

Read More : IPL 2021, RCB Vs KKR : బెంగళూరు 204 రన్స్, డివిలియర్స్ విశ్వరూపం