Corona Increase : ఏపీలో కోవిడ్ రోగులతో నిండిపోయిన ఆస్పత్రులు
ఏపీలో కరోనా తీవ్రత తారాస్థాయికి చేరింది. ఇప్పుడు బెడ్స్ కొరత వేధిస్తోంది.

Corona Intensity Increased In Ap
Corona intensity increased in AP : ఏపీలో కరోనా తీవ్రత తారాస్థాయికి చేరింది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు, రాష్ట్రంలో ఏదో ఒక మూలన ఆక్సిజన్ సరఫరాలో లోపాలు వెంటాడుతున్నాయట. ఇప్పుడు బెడ్స్ కొరత వేధిస్తోంది. కోవిడ్ ఆస్పత్రులు, కోవిడ్ సెంటర్లు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో బెడ్స్ దొరక్క కరోనా బాధితులు అల్లాడిపోతున్నారు.
ఏపీలో రోజు నాలుగు జిల్లాల్లో కొత్తగా వచ్చే పేషెంట్లను చేర్చుకునేందుకు ఖాళీ బెడ్స్ లేవు. మరికొన్ని జిల్లాలు ఇదే జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్క ఐసీయూ బెడ్ ఖాళీగా లేని పరిస్థితి నెలకొంది.
చాలా జిల్లాల్లో ఆక్సిజన్ బెడ్స్ పూర్తిగా రోగులతో నిండిపోయి ఉన్నాయి. మరోవైపు రోజు రోజుకు కొత్తగా వచ్చే పేషెంట్స్ పెరిగిపోతుండటం, అందుబాటులో ఉన్న బెడ్స్ తగ్గిపోతుండటం పరిస్థితి ఆందోషళనకరంగా మారిపోతుంది.