కరోనా రాకాసి : ముఖాన్ని మాత్రం తాకకండి

  • Published By: madhu ,Published On : March 29, 2020 / 03:43 AM IST
కరోనా రాకాసి : ముఖాన్ని మాత్రం తాకకండి

Updated On : March 29, 2020 / 3:43 AM IST

కరోనా వైరస్ భూతం వణికిస్తోంది. వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. లక్షలాది ప్రజలు ఈ వైరస్ బారిన పడిపోయారు. దీంతో ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు వైద్యులు, నిపుణులు పలు సలహాలు, సూచనలు అందచేస్తున్నారు.

దీని వల్ల ఎలాంటి నష్టాలు కలుగ చేస్తాయో వెల్లడిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూ ఎలాంటి నష్టం కలుగ చేస్తోందో చూడాలని, వెంటనే అప్రమత్తం కావాలని తెలియచేస్తున్నారు. 

చేతితో తరచూ ముఖాన్ని తాకడం మంచిది కాదంటున్నారు. ఇలా ఎందుకు చేయాలంటే..మనం చేతితో ముట్టుకున్నప్పుడు దాని నుంచి వైరస్ అంటుకుంటే… ఆ చేతి వేళ్లతో మన కళ్లు, ముక్కు, నోటిని తాకిన సమయంలో వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుందని తెలియచేస్తున్నారు. ఈ అలవాటు ఉన్న వాళ్లు వెంటనే దీనిని మానుకోవాలని సూచిస్తున్నారు. 

ముఖాన్ని తరచూ ముట్టుకుంటూనే ఉంటాం. గంటకు 20 సార్లకు పైగా ముఖాన్ని తాకుతామని అధ్యయనాల్లో తేలింది. ఇందులో దాదాపు సగం సార్లు నేరుగా మనం చేతులు, కళ్లు, ముక్కు, నోటిని తాకుతాయంటున్నారు.

ఇలా తగ్గించుకోవచ్చు : – 
* ముఖాన్ని చేతితో తాకే అలవాటును తగ్గించుకోవడానికి నిపుణుటలు కొన్ని సలహాలు, చిట్కాలు సూచిస్తున్నారు. 
* కూర్చేనే సమయంలో వీలైతే ముఖాన్ని కాకుండా..కాలిని తాకే అలవాటు చేసుకోవాలి. 
 

* సెల్ ఫోన్లు, తలుపులు, లిఫ్ట్ లు, కారు తాళాలు, ప్లాస్టిక్ తదితర వస్తువులపై వైరస్ సోకే ప్రమాదం ఉందని..వాటిని ముట్టుకుని..ముఖాన్ని తాకవద్దు. 

* పైనున్న వాటిని తాకినప్పుడు చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. 
* చేతులతో ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తుండాలి. 
 

* ఒత్తిడిని నియంత్రించుకొనేందుకు బంతిని నొక్కడం, తదితర పనులు చేస్తుండాలి. 
* ముఖాన్ని ముట్టుకోవద్దన్న నియంత్రణ..పాటించడం ఎంతైనా అవసరం అని గుర్తుకు తెచ్చుకోవాలి.