ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, 24 గంటల్లో 381 కేసులు

Andhra Pradesh
Covid Positive Cases In Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలో క్రమక్రమంగా కరోనా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. తొలుత వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. భారీగానే కరోనా టెస్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 24 గంటల్లో 381 కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 40 వేల 728 శాంపిల్స్ పరీక్షించినట్లు, కోవిడ్ వల్ల అనంతపూర్ లో ఒక్కరు, చిత్తూరులో ఒక్కరు, కృష్ణలో ఒక్కరు, విశాఖపట్టణంలో ఒక్కరు మరణించారని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 934 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని, 2020, నవంబర్ 30వ తేదీ సోమవారం రాష్ట్రంలో 1,00,57,854 శాంపిల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
జిల్లాల వారీగా కేసులు :
అనంతపూర్ : 21. చిత్తూరు : 31. ఈస్ట్ గోదావరి : 45. గుంటూరు : 35. కడప : 26. కృష్ణ : 70. కర్నూలు : 12. నెల్లూరు : 19. ప్రకాశం : 07. శ్రీకాకుళం : 10. విశాఖపట్టణం : 11. విజయనగరం : 20. వెస్ట్ గోదావరి : 74. మొత్తం కేసులు : 381