అల్లు అర్జున్‌ను అరెస్టు చేస్తే సినీ ఇండస్ట్రీ కుప్పకూలినట్లు సినీనటులు వ్యవహరించిన తీరు నిసిగ్గుగా ఉంది: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
సినిమా విడుదల చేస్తున్న సమయంలో టిక్కెట్లు ఎక్కువ రేటుకు విక్రయించేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు వారికి అనుమతిస్తున్న తీరు.. వారికి ఊడిగం చేస్తున్నట్లు అనిపిస్తుంది అన్నారు.

CPI Ramakrishna
హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్‌లో తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందితే స్పందించని సినీ ప్రముఖులు.. హీరో అల్లు అర్జున్‌ను అరెస్టు చేస్తే సినీ ఇండస్ట్రీ కుప్పకూలినట్లు వ్యవహరించిన తీరు నిసిగ్గుగా ఉందని సీపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడలోని సీపీఐ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ… అరెస్టు చేసిన తర్వాత.. మృతిరాలి కుటుంబ సభ్యులను పరామర్శిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
సినిమా విడుదల చేస్తున్న సమయంలో టిక్కెట్లు ఎక్కువ రేటుకు విక్రయించేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు వారికి అనుమతిస్తున్న తీరు.. వారికి ఊడిగం చేస్తున్నట్లు అనిపిస్తుంది అన్నారు.
కష్టపడే రైతులు పంట పండిస్తూ మద్దతు ధర కల్పించాలంటూ ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్న స్పందించని రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా టిక్కెట్లు ధరలు పెంచుకుంటానికి ఎందుకు అనుమతిస్తున్నారో చెప్పాలంటే ప్రశ్నించారు. ఈ విషయంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రిని కలిసి వారికి వివరిస్తానని చెప్పారు.
తిరోగమన తెలంగాణ.. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ఇది అద్దం పడుతోంది: కేటీఆర్