Cyclone Montha : ఏపీ ప్రజలకు హైఅలర్ట్.. దూసుకొస్తున్న మొంథా సైక్లోన్.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. విద్యా సంస్థలకు సెలవులు.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు..
Cyclone Montha : ఏపీవైపు మొంథా తుపాను దూసుకొస్తుంది. తుపాను కారణంగా ఈనెల 30వ తేదీ వరకు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
Cyclone Montha
Cyclone Montha : ఏపీవైపు మొంథా తుపాను దూసుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం వాయుగుండంగా బలపడింది. గంటకు 10కిలో మీటర్ల వేగంతో కదులుతూ పోర్ట్‌బ్లెయిర్‌కి 510 కిలో మీటర్లు, విశాఖపట్టణంకు 920, చెన్నైకి 890, కాకినాడకు 920, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు వెయ్యి కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారి.. 28వ తేదీన ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని.. అదేరోజు సాయంత్రం నుంచి రాత్రిలోపు కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని, బుధవారం ఉదయంకు తుపాను బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ముఖ్యంగా కోస్తాలోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు.
తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు.. గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 29వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు.. విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, గంగవరం పోర్టుల్లో మొదటి హెచ్చరిక జారీ చేశారు.
మొంథా సైక్లోన్ కారణంగా.. ఇవాళ (ఆదివారం) శ్రీపొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
సోమవారం బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూల్, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలతోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
మంగళవారం కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది. అదేవిధంగా విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాక.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసమీ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, విశాఖపట్టణం, అనకాపల్లి, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
The depression over southeast Bay of Bengal moved nearly west-northwestwards with a speed of 8 kmph during past 6 hours and lay centred at 2330 hrs IST of yesterday, the 25th October 2025, pic.twitter.com/kUaT4lRbfr
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 26, 2025
