Assam Resident Death Incident : అస్సోం వాసి ఇమ్మానియేల్ మృతి ఘటన.. సీఐతోపాటు ఏడుగురు పోలీసులపై కేసు నమోదు
వెంకటాచలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటాచలం నుంచి నెల్లూరుకు వాహనంలో తరలిస్తుండగా పడారుపల్లి వద్ద వంతెన పైనుంచి ఇమ్మానియేల్ దూకేశారు.

Assam resident Immanuel Death
Case Registered Eight Policemen : నెల్లూరు జిల్లాలో అస్సోం వాసి ఇమ్మానియేల్ మృతి ఘటనపై వెంకటాచలం పోలీసులపై చర్యలు తీసుకున్నారు. సీఐ గంగాధర్ రావు, ఏఎస్ఐ, మరో కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. ఎస్సై అయ్యప్ప, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులను వీఆర్ కు బదిలీ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐతో పాటు ఏడుగురు పోలీసులపై కేసు నమోదు చేశారు.
కుకీస్ తెగకు చెందిన ఇమ్మానియేల్ ఈ నెల 16న అసోం నుంచి కేరళకు వెళ్తూ వెంకటాచలం రైల్వే స్టేషన్ లో కొందరిపై ఇమ్మానియేల్ దాడికి పాల్పడ్డారు. వెంకటాచలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటాచలం నుంచి నెల్లూరుకు వాహనంలో తరలిస్తుండగా పడారుపల్లి వద్ద వంతెన పైనుంచి ఇమ్మానియేల్ దూకేశారు.
YS Sunitha : వైఎస్ వివేక హత్య కేసు.. సీబీఐకి సంచలన విషయాలు వెల్లడించిన సునీత
దీంతో తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందారు. స్వయంగా గుంటూరు ఐజీ పాల్ రాజ్, జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి విచారణ చేపట్టారు. పోలీసు నిర్లక్ష్యంతో ఈ ఘటన జరిగినట్లు నిర్ధారించారు. ఈ మేరకు సీఐతోపాటు ఏడుగురు పోలీసులపై కేసు నమోదు చేశారు.