ధర్మాడి టీం సక్సెస్ : దీప్తిశ్రీ మృతదేహం లభ్యం

  • Published By: madhu ,Published On : November 25, 2019 / 09:17 AM IST
ధర్మాడి టీం సక్సెస్ : దీప్తిశ్రీ మృతదేహం లభ్యం

Updated On : November 25, 2019 / 9:17 AM IST

మరోసారి ధర్మాడి టీం సక్సెస్ అయ్యింది. చిన్నారి దీప్తి శ్రీ మృతదేహాన్ని కనుగొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సవతి తల్లి చేతిలో దారుణ హత్యకు గురైన దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపులు చేపట్టిన సంగతి తెలిసిందే. మృతదేహాన్ని ఉంచి గోనెసంచిని ఇంద్రపాలెం బ్రిడ్జ్‌పై నుంచి ఉప్పుటేరులో వేసినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. దీనికి సంబంధించిన సీసీ దృశ్యాలు పోలీసులకు దొరికాయి. దీప్తిశ్రీ మృతదేహం కోసం పోలీసులు ధర్మాడీ సత్యం టీం బృందాన్ని రంగంలోకి దించారు.  

2019, నవంబర్ 24వ తేదీ ఆదివారం జిల్లాకు వచ్చిన ధర్మాడి టీం ఉప్పుటేరులో గాలింపులు చేపట్టడం ప్రారంభించింది. అయితే…గుర్రపు డెక్క గాలింపు చర్యలకు ఆటంకం కలిగించింది. గుర్రపుడెక్కలో మృతదేహం చిక్కుకుని ఉంటుందన్న అనుమానంతో .. ధర్మాడి సత్యం బృందం రెండు బోట్లతో గాలించారు. చివరకు ఈ టీం సక్సెస్ అయ్యింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద మునిగిపోయిన రాయల్ వశిష్ట ప్రైవేటు బోటును వెలిసితీసింది ధర్మాడి టీం. 

ఇక చిన్నారి దీప్తి శ్రీ విషయానికి వస్తే…
> కాకినాడలో నేతాజీ నగర్‌లోని గవర్నమెంట్‌ స్కూల్లో దీప్తిశ్రీ చదువుకొంటోంది. 
> నవంబర్ 22వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం దీప్తి శ్రీ కిడ్నాప్‌కు గురైంది. 
> సాయంత్రం ఆమె ఇంటికి రాకపోవడంతో.. మేనత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ వ్యవహరంలో సవతి తల్లి శాంతికుమారి ప్రమేయం ఉందని పోలీసులు అనునించారు. 
> శాంతికుమారిని అదుపులోకి తీసుకుని విచారించారు.
> దీప్తిశ్రీ మృతదేహాన్ని ఎక్కడ దాచిందో మాత్రం చెప్పలేదు. 
> చివరకు ఉప్పుటేరులో దీప్తి శ్రీ మృతదేహాన్ని పడేసినట్లు పోలీసులు నిర్ధారించారు. 
Read More : రాజధానికి బాబు : సమాధానం చెప్పాకే పర్యటించాలి – రైతులు