లేటరైట్ గనులు, పోర్టులు, ప్రకృతి సంపద మొత్తం వారి గుప్పెట్లోనే: దేవినేని ఉమ

''నియంతృత్వ పోకడలతో అడ్డగోలుగా ప్రజాసంపదను కొల్లగొట్టిన అక్రమార్కులు తగిన మూల్యం చెల్లించక తప్పదు" అని దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు.

లేటరైట్ గనులు, పోర్టులు, ప్రకృతి సంపద మొత్తం వారి గుప్పెట్లోనే: దేవినేని ఉమ

devineni uma

Updated On : December 8, 2024 / 6:29 PM IST

ఉత్తరాంధ్రలో లేటరైట్‌పై, భీమిలి తీరంలో వైసీపీ నేతల వారసులు అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారంటూ టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ప్రకృతి సంపదను దోచుకుంటే వైసీపీ ఐదేళ్లు పాలన కొనసాగించిందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.

“బెదిరించడం.. భయపెట్టడం.. లాక్కోవడం.. ఇదీ ఐదేళ్లు వైఎస్ జగన్ సాగించిన అధికార దందా తీరు. అక్రమాలు, అవినీతిలో తామేమి తక్కువ కాదంటున్న వారసులు. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వైసీపీ మాఫియా బాగోతాలు.

లేటరైట్ గనులు, పోర్టులు, ప్రకృతి సంపద మొత్తం వారి గుప్పెట్లోనే. కన్నుపడిన భూముల కబ్జా.. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు. నియంతృత్వ పోకడలతో అడ్డగోలుగా ప్రజాసంపద కొల్లగొట్టిన అక్రమార్కులు తగిన మూల్యం చెల్లించక తప్పదు” అని దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు.

మెరుగైన సేవల కోసం ఇన్ని యాప్‌లను తీసుకువచ్చాం: మంత్రి శ్రీధర్ బాబు