Dharmavaram Bandh : దాడికి నిరసనగా.. పట్టుచీరల వ్యాపారులు వారం రోజులు ధర్మవరం బంద్ కు పిలుపు
వ్యాపారుల దుస్తులు తీసివేసి, అవినాష్ దాడి చేశారు. పట్టు చీరల వ్యాపారులపై అవినాష్ దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Dharmavaram bandh
Dharmavaram Silk Saree Traders : శ్రీ సత్యసాయి జిల్లాలో నేటి నుంచి వారం రోజులపాటు ధర్మవరం పట్టుచీరల వ్యాపారులు బంద్ కు పిలుపునిచ్చారు. పట్టు చీరల వ్యాపారులపై దాడికి నిరసనగా బంద్ పాటిస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడకు చెందిన వ్యాపారి, వైసీపీ నేత అవినాష్ పట్టు చీరల వ్యాపారులపై దాడి చేశారు. చీరలకు సంబంధించిన డబ్బులు అడిగినందుకుగానూ పట్టు చీరల వ్యాపారులను అవినాష్ ఘోరంగా అవమానించారు.
వ్యాపారుల దుస్తులు తీసివేసి, అవినాష్ దాడి చేశారు. పట్టు చీరల వ్యాపారులపై అవినాష్ దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమాయక వ్యాపారులపై దాడికి నిరసనగా చేనేత వ్యాపారుల బంద్ పాటిస్తున్నారు. ఇప్పటికే బాధితులకు అండగా ఎమ్మెల్యే కేతిరెడ్డి, మాజీ మంత్రి పరిటాల సునీత నిలిచారు.
టీడీపీ అధినేత చంద్రబాబు బాధితులతో నేరుగా మాట్లాడారు. వైసీపీ హయాంలో వ్యాపారులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శలు చేశారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుముకుంటుంది. వ్యాపారులంతా కలసి సిల్క్ హౌస్ బంద్ చేయాలని నిర్ణయించారు.