Diesel Locomotive : తప్పిన ప్రమాదం..పట్టాలు తప్పిన రైలు ఇంజన్

కర్నూలులో రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. కాచిగూడ నుండి డోన్ కు వెళ్తున రైలు ఇంజన్ శుక్రవారం రాత్రి కర్నూలు రైల్వేస్టేషన్ దాటిన తర్వాత పట్టాలు తప్పింది.

Diesel Locomotive : తప్పిన ప్రమాదం..పట్టాలు తప్పిన రైలు ఇంజన్

Derailment

Updated On : June 25, 2021 / 9:47 PM IST

Diesel Locomotive : కర్నూలులో రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. కాచిగూడ నుండి డోన్ కు వెళ్తున రైలు ఇంజన్ శుక్రవారం రాత్రి కర్నూలు రైల్వేస్టేషన్ దాటిన తర్వాత పట్టాలు తప్పింది. దేవనగర్ వద్ద ఈఘటన చోటు చేసుకుంది.

రైలు ఇంజన్ కు బోగీలు లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఇంజన్ పట్టాలు తప్పడంతో ఈ మార్గంలో నడిచే ఎగ్మూర్ ఎక్స్ ప్రెస్, గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైళ్లను గద్వాల్‌లో నిలిపివేశారు. రైలు పట్టాల నుండి సరిచేయడానికి మూడు నుంచి 4 గంటల సమయం పట్టవచ్చని సమాచారం. దీంతో ఈ మార్గంలో  నడిచే రైళ్లు కొంత ఆలస్యంగా నడుస్తున్నాయి.