కరోనా బాధితులను నేరస్థులుగా చూడొద్దు : సీఎం జగన్

ఏపీలో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కలిసి కట్టుగా పోరాడాల్సిన సమయమిదిగా పేర్కొన్నారు. సామాజిక దూరం పాటిస్తూ కరోనాను దూరం చేయాలని పిలుపునిచ్చారు.
ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని, లాక్ డౌన్ నిబంధనలను ఎవరూ ఉల్లంఘించ కూడదని సూచించారు. కరోనా బాధితులను నేరస్థులుగా చూడకూడదన్నారు. కరోనా బాధితులపై అప్యాయత చూపాలని జగన్ చెప్పారు. కరోనా కాటుకు కులమతాలు లేవన్నారు.
ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాలకు అందరూ కులమతాలకు అతీతంగా దీపాలు వెలిగించాలని, అందరూ ఒకటే అనే ఐక్యతను చాటాలని జగన్ తెలిపారు. ఒక మతాన్నో, వర్గాన్నో, లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు.
కరోనా కాటుకు కులాలు, మతాలు, ప్రాంతాలు లేవని చెప్పారు. మన ఐక్యతను దేశానికి, ప్రపంచానికి చాటి చెబుతామని జగన్ తెలిపారు. ప్రధాని పిలుపు మేరకు లైట్లు ఆఫ్ చేద్దామని జగన్ పిలుపునిచ్చారు.
Also Read | ఆ రెండు జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసుల్లేవు