లడ్డూ వివాదం.. చంద్రబాబు ఆరోపణలపై విచారణకు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిల్

లడ్డూ ప్రసాదం అసలు కలుషితమైందా? లేదా? అందులో జంతువుల కొవ్వు కలిసిందా? లేదా? శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి.

లడ్డూ వివాదం.. చంద్రబాబు ఆరోపణలపై విచారణకు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిల్

Subramanian Swamy On Ttd Laddu Row (Photo Credit : Google)

Updated On : September 23, 2024 / 7:52 PM IST

Ttd Laddu Row : తిరుమల లడ్డూ వివాదం వ్యవహారంపై సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పిటిషన్లు వేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై దర్యాఫ్తు చేయాలంటూ సుబ్రమణ్య స్వామి పిటిషన్ వేశారు. కల్తీ నెయ్యి అంశంలో ఆధారాలు లేకుండా చంద్రబాబు ఆరోపణలు చేశారని సుబ్రమణ్యస్వామి అన్నారు. అటు వైవీ సుబ్బారెడ్డి సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. లడ్డూ వ్యవహారంలో విచారణ కోరుతూ పిటిషన్ వేశారాయన. రిటైర్డ్ జడ్జి లేదా నిపుణులతో ఎంక్వైరీ జరపాలని కోరారు.

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో తిరుమల ప్రసాదం కల్తీ అంశంపై వరుస పిటిషన్లు దాఖలవుతున్నాయి. లడ్డూ ప్రసాదం అసలు కలుషితమైందా? లేదా? అందులో జంతువుల కొవ్వు కలిసిందా? లేదా? శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. భక్తులు గందరగోళానికి గురవుతున్నారు. చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేశారు అనే అంశానికి సంబంధించి బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి పిటిషన్ ఫైల్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

Also Read : ఆ వ్యక్తిని వదిలిపెట్టం..! శ్రీవారి ఆస్తుల అమ్మకంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

టీటీడీ ప్రసాదంలో జంతువుల కొవ్వు, ఇతర కుళ్లిన వస్తువులతో కల్తీ చేశారని చంద్రబాబు చేసిన నిరాధార ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సుబ్రమణ్య స్వామి. చంద్రబాబు తన నిరాధార ఆరోపణలతో భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నారని, దీనిపై తక్షణమే విచారణకు ఆదేశించేలా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు.