AP : కరోనా చికిత్సకు అధిక ఫీజు వసూలు..ఆసుపత్రిపై క్రిమినల్ కేసు

ఏపీలోని కాకినాడలో కరోనా చికిత్సకు అధిక ఫీజలు వసూలు చేసిన ఓ ప్రైవేటు ఆసుపత్రిపై అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అటు హైకోర్టు ఆదేశాలను..ఇటు ప్రభుత్వం నిబంధనలకు పట్టించుకోకుండా కరోనా చికిత్సలకు అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న ఆసుపత్రులపై అదికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈక్రమంలో చికిత్స చేయించుకున్న దంపతుల నుంచి రూ.14 లక్షలు వసూలు చేసిన ఆసుపత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

AP : కరోనా చికిత్సకు అధిక ఫీజు వసూలు..ఆసుపత్రిపై క్రిమినల్ కేసు

Criminal Case Registered Against Ap Hospital

Updated On : June 11, 2021 / 10:44 AM IST

Criminal case registered against AP Hospital : కరోనా చికిత్స పేరుతో రోగుల నుంచి అధిక ఫీజుల వసూలు చేస్తున్న వైనంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా…ప్రభుత్వం నిర్ణయించిన బిల్లులు కంటే ఎక్కవగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినా ఎటువంటి మార్పులేదు. కరోనా చికిత్స పేరుతో దోపిడీలు కొనసాగుతునే ఉన్నాయి. అటు ధర్మాసనం ఇచ్చిన తీర్పును..ఇటు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కూడా పాటించకుండా దోపిడీల దందాలు కొనసాగిస్తున్నాయి కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు. ఈక్రమంలో కరోనా సోకిన దంపతుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసిన ఓ ప్రైవేటు ఆసుపత్రిపై క్రిమినల్ చేసులు నమోదు చేశారు అధికారుల. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఓ ప్రైవేలు ఆసుపత్రి కరోనా పేరుతో దంపతు నుంచి ఏకంగా నిబంధనలకు వ్యతిరేకంగా రూ.14 లక్షలు వసూలుచేసింది. దీంతో వైద్య అధికారులు..పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

కాకినాడలోని సాయిసుధ ప్రైవేటు హాస్పిటల్ పై అధికారులు క్రిమినల్ చేసులు నమోదు చేశారు. సత్యనారాయణ..అతని భార్యకు కరోనా సోకగా చికిత్స కోసం సాయిసుధ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.కానీ సరైన చికిత్స అందించకపోవటంతో సత్యనాయణ ప్రాణాలు కోల్పోయారు. అయినా గానా ఆసుపత్రి యాజమాన్యం మృతుడి కుటుంబం నుంచి రూ.14 లక్షలు వసూలు చేసింది. ఈ విషయాన్ని సత్యనారాయణ సోదరుడు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో సంబంధిత అధికారులు విచారణ చేపట్టగా ఆ విషయం నిజమేనని తేలటంతో సాయిసుధ ఆసుపత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

కాగా..ఏపీలో కరోనా పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ ఏపీలో కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులు ఎంత వసూలు చేయాలన్న దానిపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే కరోనా చికిత్స చేసేందుకు ప్రత్యేకంగా ఆస్పత్రులకు అనుమతులు కూడా మంజూరు చేసింది. అయినా ఇప్పటికీ రాష్ట్రంలో విజిలెన్స్‌, టాస్క్‌ఫోర్స్‌ నిర్వహిస్తున్న దాడుల్లో అనుమతుల్లేని ఆస్పత్రులు, భారీగా బిల్లులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై భారీ జరిమానాలు, క్రిమినల్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.

ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి హైకోర్టు చెక్‌ ఏపీలో కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి చెక్‌ పెట్టేలా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం ఇకపై ప్రైవేటు ఆస్పత్రులు రోగులకు చికిత్స తర్వాత బిల్లులు ఇచ్చేముందు వాటిపై ప్రభుత్వం నియమించిన నోడల్‌ అధికారి సంతకం తప్పనిసరి. నోడల్‌ అధికారి ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీలకు అనుగుణంగా బిల్లులు ఉన్నాయో లేదో సరిచూసి బిల్లులపై సంతకం చేయాల్సి ఉంటుంది. అప్పుడే సదరు బిల్లుల్ని ఆస్పత్రులు రోగులకు ఇవ్వాల్సి ఉంటుంది. అఖిల భారత న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యాన్ని విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ అటు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను..ఇటు ప్రభుత్వం విధించిన నిబంధనలను కూడా పట్టించుకోకుండా ప్రైవేటు ఆసుపత్రులు అధిక దోపిడీలు చేస్తున్నట్లుగా సత్యనాయణ దంపతుల కుటుంబం నుంచి రూ.14 లక్షలు వసూలు చేసిన ఘటనతో మరోసారి నిరూపించబడింది.