జూన్ 1 నుంచి ఇంగ్లీష్ మీడియం : తల్లులకు సీఎం జగన్ కానుక
పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం భోదన ప్రవేశపెడుతున్నామని సీఎం జగన్ చెప్పారు. ఈ ఏడాది జూన్ 1 నుంచే అన్ని ప్రభుత్వ స్కూల్స్

పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం భోదన ప్రవేశపెడుతున్నామని సీఎం జగన్ చెప్పారు. ఈ ఏడాది జూన్ 1 నుంచే అన్ని ప్రభుత్వ స్కూల్స్
పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం భోదన ప్రవేశపెడుతున్నామని సీఎం జగన్ చెప్పారు. ఈ ఏడాది జూన్ 1 నుంచే అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశ పెడతామన్నారు. తెలుగు సబ్జెక్ట్ కచ్చితంగా ఉంటుందన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని జగన్ చెప్పారు. తెలుగు మీడియం కచ్చితంగా కావాలనే పెద్ద సినిమా స్టార్ సహా నేతలెవరూ వాళ్ల పిల్లలను తెలుగు మీడియంలో చదివించరని సీఎం జగన్ విమర్శించారు.
చిత్తూరులో గురువారం(జనవరి 9,2020) జగనన్న అమ్మఒడి పథకాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. 1వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల తల్లి లేదా సంరక్షకుల బ్యాంకు ఖాతాలో ఏటా రూ.15వేలు వేస్తామన్నారు సీఎం జగన్.
* పిల్లలను బడులకు పంపే తల్లులకు సీఎం జగన్ కానుక
* అమ్మఒడి పథకాన్ని ప్రారంభించిన జగన్
* అమ్మఒడి పథకాన్ని ప్రారంభించడం దేవుడు నాకిచ్చిన వరం
* మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అమ్మఒడిని అమలు చేస్తున్నాం
* అమ్మఒడితో 43లక్షల మంది తల్లులకు లబ్ది
* 82లక్షల మంది విద్యార్థులకు మేలు
* చదువనేది పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే నిజమైన ఆస్తి
* 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు చదువుకోడం ప్రాథమిక హక్కు
* పెద్ద సినిమా యాక్టర్ కూడా వాళ్ల పిల్లలను తెలుగు మీడియంలో చదివించడం లేదు
* జూన్ 1 నుంచి ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం బోధన
* తెలుగు సబ్జెక్ట్ కచ్చితంగా ఉంటుంది
* పెద్ద సినిమా స్టార్ సహా నేతలెవరూ వారి పిల్లలను ప్రభుత్వ స్కూల్స్ లో చదివించరు
* 42లక్షల 12వేల మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.6వేల318 కోట్లు జమ చేస్తాం
* ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలకు అమ్మఒడి వర్తింపు
* ఈ ఏడాది 75శాతం హాజరు నిబంధన మినహాయింపు
* 2021 నుంచి 75శాతం హాజరు నిబంధన తప్పనిసరి
* నేరుగా తల్లులు లేదా సంరక్షకుల బ్యాంకు ఖాతాలకు రూ.15వేలు బదిలీ
* పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే ఇంగ్లీష్ మీడియం