Vallabhaneni Vamsi : జైల్లో నన్ను ఒంటరిగా ఉంచుతున్నారు, కేసుకు సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారు- న్యాయమూర్తితో వంశీ కీలక వ్యాఖ్యలు

వైసీపీ నేత వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగిసింది. మూడు రోజుల పాటు వంశీని ప్రశ్నించారు పోలీసులు.

Vallabhaneni Vamsi : జైల్లో నన్ను ఒంటరిగా ఉంచుతున్నారు, కేసుకు సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారు- న్యాయమూర్తితో వంశీ కీలక వ్యాఖ్యలు

Vallabhaneni Vamsi

Updated On : February 27, 2025 / 6:43 PM IST

Vallabhaneni Vamsi : మూడు రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు వంశీని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కోర్టులో వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. జైలు సెల్ లో తనను ఒంటరిగా ఉంచుతున్నారని, పోలీసులు కేసుకు సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు వంశీ.

Also Read : పవన్‌లో అదే ఫైర్‌.. వైసీపీకి తన మార్క్ ట్రీట్‌మెంట్‌.. ఏం చేస్తున్నారో తెలుసా?

కస్టడీ ముగిశాక.. వంశీకి వైద్య పరీక్షల నిర్వహించారు. అనంతరం విజయవాడ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. న్యాయమూర్తి వంశీని కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి వంశీ సమాధానం చెప్పారు. కేసుకు సంబంధం లేని ప్రశ్నలు అడిగి పోలీసులు తనను ఇబ్బంది పెడుతున్నారని న్యాయమూర్తితో వంశీ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సంబంధం లేని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారంటూ పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించారు.

కేసుకు సంబంధం ఉన్న ప్రశ్నలే అడుగుతున్నామని, కేసుకు సంబంధం లేని వాటి గురించి తాము ఎప్పుడూ వంశీని అడగలేదని పోలీసుల తరపున పీపీ న్యాయమూర్తికి వెల్లడించడం జరిగింది. అదే విధంగా వంశీని జైల్లో ఒంటరిగా ఉంచుతున్నారని వంశీ తరపు న్యాయవాది చెప్పారు. వంశీ అనారోగ్యం రీత్యా ఒంటరిగా ఉంచొద్దని.. నలుగురు ఐదుగురు ఖైదీలు ఉన్న బ్యారెక్ లో వేయాలని.. వంశీ తరపు న్యాయవాది.. న్యాయమూర్తితో చెప్పడం జరిగింది.

నలుగురు ఐదుగురు ఉండే బ్యారెక్ లో ఉంచడం వల్ల వంశీ అందరితో మాట్లాడతాడని చెప్పారు. ఒంటరిగా ఉండటం వల్ల ఆయన ఆరోగ్యానికి ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉండొచ్చన్నారు. అయితే.. వంశీ వీఐపీ కాబట్టి.. వంశీకి ఏదైనా హాని ఉంటుందని వీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నామని, ఇతర ఖైదీలతో ఉంచడం లేదని పీపీ కోర్టుకు తెలిపారట.

Also Read : నేతల వరుస రాజీనామాలతో ఓవైపు టెన్షన్‌.. మరోవైపు ఆధిపత్య పోరు.. రగడకు చెక్ పెట్టకపోతే ఇక..

వైసీపీ నేత వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగిసింది. మూడు రోజుల పాటు వంశీని ప్రశ్నించారు పోలీసులు. మూడో రోజు దాదాపు మూడున్నర గంటల పాటు కృష్ణలంక పోలీసులు వంశీని క్వశ్చన్ చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపులకు సంబంధించి పాత్రధారులపై కీలకంగా ప్రశ్నించారు. అరెస్ట్ సమయంలో వంశీ తన సెల్ ఫోన్ ను ఎక్కడ దాచారని కూడా అడిగినట్లు తెలుస్తోంది. తనకు ఏమీ తెలియదని, గుర్తు లేదని వంశీ పదే పదే చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు.