వైసీపీ వర్సెస్ టీడీపీ.. నెల్లూరులో జోరుమీదున్న పార్టీ ఏది?

వలసలు టీడీపీకి ఊపునిస్తాయా? ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీని చేర్చుకున్న టీడీపీకి కలిగే రాజకీయ ప్రయోజనాలు ఏంటి?

వైసీపీ వర్సెస్ టీడీపీ.. నెల్లూరులో జోరుమీదున్న పార్టీ ఏది?

Nellore District Political Scenario 2024

Nellore District Political Scenario : వైసీపీ కంచుకోట వంటి జిల్లాలలో నెల్లూరు ఒకటి. గత ఎన్నికల్లో 10కి పది స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది ఫ్యాన్ పార్టీ. మరి త్వరలో జరగబోయే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉంది? వైసీపీలో నెంబర్ 2 గా చెలామణి అవుతున్న విజయసాయిరెడ్డి సొంత జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంది?

గత ఎన్నికల్లో కోలుకోని దెబ్బతిన్న టీడీపీ.. ప్రస్తుతం ఎలాంటి రాజకీయం చేస్తోంది? వలసలు టీడీపీకి ఊపునిస్తాయా? ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీని చేర్చుకున్న టీడీపీకి కలిగే రాజకీయ ప్రయోజనాలు ఏంటి? నెల్లూరు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రానున్నాయి? నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది? 10టీవీ ఎక్స్ క్లూజివ్ అనాలసిస్..

నెల్లూరు సిటీ నియోజకవర్గం
వైసీపీ – ఖలీల్ అహద్మ్
టీడీపీ – పి.నారాయణ

నెల్లూరు రూరల్ నియోజకవర్గం
వైసీపీ – ఆదాల ప్రభాకర్ రెడ్డి
టీడీపీ – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ నుంచి టీడీపీలో చేరిక)

కావలి నియోజకవర్గం (కావలిలో హోరాహోరి పోటీ జరిగే ఛాన్స్)
వైసీపీ – రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి (సిట్టింగ్ ఎమ్మెల్యే)
టీడీపీ – కావ్య కృష్ణారెడ్డి (టీడీపీ)

ఉదయగిరి నియోజకవర్గం (టీడీపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి)
వైసీపీ – మేకపాటి రాజగోపాల్ రెడ్డి
టీడీపీ – కాకర్ల సురేశ్

ఆత్మకూరు
వైసీపీ – మేకపాటి విక్రమ్ రెడ్డి(సిట్టింగ్ ఎమ్మెల్యే)
టీడీపీ – ఆనం రామనారాయణ రెడ్డి (వెంకటగిరి ఎమ్మెల్యే) (గతంలో ఆత్మకూరుకు ప్రాతినిధ్యం వహించిన ఆనం)

కోవూరు
వైసీపీ – నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (ఎమ్మెల్యే)
టీడీపీ – పోలంరెడ్డి దినేశ్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి (ఎంపీ వేమిరెడ్డి భార్య)
ప్రశాంతి రెడ్డికి టికెట్ హామీతోనే టీడీపీలో చేరిన వేమిరెడ్డి కుటుంబం

సర్వేపల్లి
వైసీపీ – కాకాణి గోవర్ధన్ రెడ్డి
టీడీపీ – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (వరుసగా నాలుగుసార్లు ఓడిపోయిన సోమిరెడ్డి)

గూడురు
వైసీపీ – మేరిగ మురళి (ఎమ్మెల్సీ, వైసీపీ ఇంఛార్జి)
టీడీపీ – పాశం సునీల్ కుమార్ (మాజీ ఎమ్మెల్యే)
సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ ను తప్పించిన వైసీపీ

వెంకటగిరి
వైసీపీ – నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి(వైసీపీ ఇంఛార్జి), రవిచంద్రారెడ్డి (వైసీపీ అధికార ప్రతినిధి)
టీడీపీ – కురుగుండ్ల రామకృష్ణ (మాజీ ఎమ్మెల్యే)
టీడీపీ టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్యే ఆనం

సూళ్లూరుపేట
వైసీపీ – కిలివేటి సంజీవయ్య(సిట్టింగ్ ఎమ్మెల్యే)
టీడీపీ – నెలవల విజయశ్రీ
కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చిన టీడీపీ

గత ఎన్నికల మాదిరే ఈ ఎన్నికల్లోనూ 10 అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే పరిస్థితి అధికార వైసీపీకి ఎదురవుతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవాకు టీడీపీ చెక్ పెడుతుందా? లేదా? ఎన్నికల వరకు చూడాల్సిందే. ఈసారి సమీకరణాలు మారిపోయాయి. గతంలో వైసీపీ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు అనర్హత వేటుకు గురయ్యారు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను వైసీపీ పక్కన పెట్టింది. ఐదు స్థానాల్లో వైసీపీ కొత్త వాళ్లకు చోటు ఇచ్చింది. మరో ఐదు స్థానాల్లో సిట్టింగ్ లకే సీట్లు దక్కాయి. ఒకరకంగా చూస్తే టీడీపీకి నెల్లూరు అంతగా అచ్చి రావడం లేదనే చర్చ బలంగా ఉంది. ఈసారి ఆ పరిస్థితి మారుతుందో లేదో చూడాలి.

ఈసారి చాలా నియోజకవర్గాల్లో ఆర్థికంగా పరిపుష్టిగా కలిగిన నాయకులు టీడీపీ నుంచి రంగంలో ఉన్నారు. ఆర్థికపరమైన అంశాలే ఎన్నికలను శాసిస్తాయనే చర్చ ఉంది. ఇరు పార్టీల అభ్యర్థుల ఒకే సామాజికవర్గానికి (రెడ్డి) చెందిన నాయకులే కావడం విశేషం. ఆర్థికపరంగా కూడా నువ్వా? నేనా? అన్నట్లుగా పోటీపడే అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. పది అసెంబ్లీ స్థానాల్లో ఎవరిది పైచేయి అవుతుంది? ఎవరి ఎత్తులు ఫలిస్తాయి? అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు చూడాల్సిందే.

 

పూర్తి వివరాలు..