Fake Challan Scam : నకిలీ చలాన్ల భారీ స్కామ్.. సీఎం జగన్ కీలక ఆదేశం

రాష్ట్రంలో సంచలనం రేపిన నకిలీ చలాన్ల స్కామ్ పై సీఎం జగన్ ఆరా తీశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో జగన్ ఫోన్ లో మాట్లాడారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అక్రమార్కుల నుంచి సొమ్ము రికవరీపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇప్పటికే రూ.40 లక్షలకు పైగా సొమ్ము రికవరీ చేసినట్లు అధికారులు సీఎంకి తెలిపారు. అలాగే రిజిస్ట్రేషన్ల సాఫ్ట్‌వేర్ లో మార్పులు చేసినట్లు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ల సాఫ్ట్‌వేర్‌ను ఎన్ఐసీ, సీఎఫ్‌ఎంఎస్‌లకు అనుసంధానం చేయడం ద్వారా అవకతవకలకు చెక్ చెప్పొచ్చని సీఎంకు వివరించారు అధికారులు.

Fake Challan Scam : నకిలీ చలాన్ల భారీ స్కామ్.. సీఎం జగన్ కీలక ఆదేశం

Fake Challan Scam

Updated On : August 13, 2021 / 5:11 PM IST

Fake Challan Scam : రాష్ట్రంలో సంచలనం రేపిన నకిలీ చలాన్ల స్కామ్ పై సీఎం జగన్ ఆరా తీశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో జగన్ ఫోన్ లో మాట్లాడారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అక్రమార్కుల నుంచి సొమ్ము రికవరీపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇప్పటికే రూ.40 లక్షలకు పైగా సొమ్ము రికవరీ చేసినట్లు అధికారులు సీఎంకి తెలిపారు. అలాగే రిజిస్ట్రేషన్ల సాఫ్ట్‌వేర్ లో మార్పులు చేసినట్లు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ల సాఫ్ట్‌వేర్‌ను ఎన్ఐసీ, సీఎఫ్‌ఎంఎస్‌లకు అనుసంధానం చేయడం ద్వారా అవకతవకలకు చెక్ చెప్పొచ్చని సీఎంకు వివరించారు అధికారులు.

ఏపీలో బోగస్ చలాన్ల భారీ స్కాం వెలుగుచూసింది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్లాది రూపాయలను అక్రమార్కులు తమ జేబుల్లో వేసుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్ లోపాలను ఆసరాగా చేసుకుని అక్రమాలకు తెగబడుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చోటు చేసుకున్న ఈ అవినీతి అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది.

ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈ బోగస్ చలాన్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 35 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఉన్నతాధికారులు దాడులు నిర్వహించినట్లు రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు తెలిపారు. సీఎఫ్ఎంఎస్‌లోని లోపాలే ఆసరాగా కోట్లు కొల్లగొట్టినట్లు గుర్తించారు. సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక లోపాన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు ఈ చలానాలను దారి మళ్లిస్తున్నట్లు తేల్చారు. సీఎప్ఎంఎస్, ఈ-చలానా, ఈసీ, ఆర్‌హెచ్, నకళ్లను సీనియర్ సిస్టెంట్లు చేయాల్సి ఉండగా.. ఈ పనులను ప్రైవేటు రైటర్స్‌తో చేయిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ దందా వెనుక సబ్ రిజిస్ట్రార్లే సూత్రధారులుగా ఉన్నారనే ఆరోపణలున్నాయి. డాక్యుమెంట్ రైటర్లు కేవలం పాత్రధారులేనని, రిజిస్ట్రార్లు చెప్పినట్లు వీరు చేస్తున్నారని సమాచారం

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వెలుగుచూసిన బోగస్ చలాన్ల స్కామ్‌ను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అక్రమాల వెలికితీతకు విజిలెన్స్ లేదా సీఐడీకి కేసును అప్పగించే అవకాశముంది. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులను ఆదేశించింది ప్రభుత్వం.

ఏడాది నుంచి జరిగిన రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటివరకు 5.5 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు. రూ.10 కోట్ల వరకు అక్రమాలు జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశారు.