Fake Notes : ఏపీలో పింఛన్ల పంపిణీలో నకిలీ నోట్లు
ఏపీలో పింఛన్ల పంపిణీలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలో 38 రూ.500 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

FAKE NOTE
Fake notes : ఏపీలో పింఛన్ల పంపిణీలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలో 38 రూ.500 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ ప్రభుత్వం జనవరి నుంచి పెంచిన పింఛన్లను ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీకి శ్రీకారం చుట్టింది.
అందులో భాగంగా నరసాయపాలెం ఎస్సీ కాలనీలో వాలంటీర్ పింఛన్లు పంపిణీ చేసుందుకు శనివారం యర్రగొండపాలెం బ్యాంకులో డబ్బును డ్రా చేశారు. ఆదివారం ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేసి వెళ్లిన తర్వాత నకిలీ నోట్లుగా గుర్తించిన లబ్ధిదారులు వాలంటీర్ దృష్టికి తీసుకెళ్లారు.
Fake Currency Gang : నకిలీ నోట్ల తయారీ ముఠా అరెస్ట్-రూ.45 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం
వాలంటీర్ తన దగ్గర ఉన్న నోట్లల్లో మరిన్ని నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత పంపిణీ చేసిన మొత్తం రూ.19 వేలు నకిలీ రూ.500 నకిలీ నోట్లను తిరిగి స్వాధీనం చేసుకున్న వాలంటీర్ అధికారులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు. నకిలీ నోట్లు ఎలా వచ్చాయనే కోణంలో విచారిస్తున్నారు.