Fake notes: పొలంలో రూ.500 నోట్ల కట్టలు.. వాటిని పట్టుకుని చూస్తే షాక్‌..

దాదాపు 40 కట్టలు ఒకే దగ్గర పడి ఉన్నాయి.

Fake notes: పొలంలో రూ.500 నోట్ల కట్టలు.. వాటిని పట్టుకుని చూస్తే షాక్‌..

Updated On : February 25, 2025 / 11:41 AM IST

ఓ పొలంలో నోట్ల కట్టలు కనపడ్డాయి. అయితే, ఎంతో ఆశతో వాటిని పట్టుకుని చూసిన రైతులు.. ఆ నోట్ల కట్టలన్నీ నకిలీవని తెలియడంతో షాక్‌కు గురయ్యారు. ఆ నోట్లపై రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కాకుండా చిల్డ్రన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉంది.

ఈ ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో చోటుచేసుకుంది. నార్కట్‌పల్లి, అద్దంకి రహదారి వద్ద బొత్తలపాలెం వద్ద పొలాలు ఉంటాయి. అక్కడి ఓ రైతు పొలంలో రూ.500 నోట్ల కట్టలు కనపడ్డాయి.

Also Read: శివరాత్రి వేళ గుడికి వెళ్తున్న భక్తులపై ఏనుగుల దాడి… ముగ్గురు మృతి.. చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి.. రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా

దాదాపు 40 కట్టలు ఒకే దగ్గర పడి ఉన్నాయి. వాటిని స్థానిక రైతులు గుర్తించి, అవి నిజమైన నోట్లే అనుకుని వాటిలో కొన్నింటిని చప్పుడు చేయకుండా తీసుకెళ్లారు. అయితే, ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది.

మిర్యాలగూడ గ్రామీణ సీఐ వీరబాబు ఆ పొలం వద్దకు వెళ్లి అక్కడ మిగిలి ఉన్న నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్న నోట్లన్నీ నకిలీవేనని పోలీసులు తేల్చారు. అవి అక్కడికి ఎలా వచ్చాయి? వాటిని ఎందుకు ముద్రించారు? అన్న వివరాలను తేల్చేందుకు దర్యాప్తు జరుపుతున్నారు.