నంద్యాలలో ఫ్యామిలీ సూసైడ్, సీఐ, హెడ్ కానిస్టేబుల్ అరెస్టు

Family suicide in Nandyal : కర్నూలు జిల్లా నంద్యాలలో నలుగురు చావుకు కారణమైన ఖాకీలపై వేటు పడింది. నంద్యాల సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ను అరెస్ట్ చేశారు. అబ్దుల్ సలాం ఫ్యామిలీ ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమని విచారణలో తేలడంతో వారిపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇద్దరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈనెల 3న అబ్దుల్ సలాం కుటుంబం రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది.
సలామ్‌తో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. సీఐ సోమశేఖర్‌రెడ్డి వేధింపులే తమ మృతికి కారణమంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. సలామ్ సెల్ఫీ వీడియో బయటకు రావడంతో… పోలీసులపై ప్రజాగ్రహం పెల్లుబికింది. ప్రజా సంఘాలు నంద్యాల పోలీస్ స్టేషన్‌ను ముట్టడించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, హోంమంత్రి సుచరిత పోలీసులపై సీరియస్ అయ్యారు.
https://10tv.in/nandyal-family-suicide-why-did-abdul-salam-commit-suicide-what-happened/
డీజీపీ గౌతమ్ సవాంగ్.. విచారణకు ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారుల విచారణలో సీఐ, హెడ్‌కానిస్టేబుల్ వేధింపులతోనే సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. దీంతో ఆ ఇద్దరిపైనా చర్యలు తీసుకున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవడంతో.. సలామ్ కుటుంబ సభ్యులు, బంధువులకు కాస్తా ఉపశమనం లభించింది. ఇద్దరినీ విధుల నుంచి పూర్తిగా తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.