జనసేనాని కోసం అభిమానుల పూజలు

జనసేనాని కోసం అభిమానుల పూజలు

Fans Worship For Janasenani Pawan Kalyan

Updated On : April 18, 2021 / 1:07 PM IST

జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ కరోనా కారణంగా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కోలుకోవాలని ఇప్పటికే అభిమానులు పెద్దఎత్తున పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు పవన్‌ ఆరోగ్యం బాగుండాలని పవన్‌ ఫోటోలను, కటౌట్‌లను గుడికి తీసుకెళ్లి మరీ అర్చనలు చేయిస్తున్నారు.

వకీల్ సాబ్ సినిమా విడుదలై మంచి జోష్‌‌లో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు.. పవన్ కరోనా బారిన పడటం తీవ్ర నిరాశకు గురి చేసింది. మామూలుగానే పవన్‌ అంటే ప్రాణాలు ఇచ్చే ఆయన అభిమానులు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను ఐసోలేషన్‌లో చూసి తట్టుకోలేకపోతున్నారు. తమ హీరో త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని సినీ, రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు.

మరోపక్క పవన్‌ కళ్యాణ్.. కరోనా బారిన పడటంతో సినీ పరిశ్రమ కూడా ఉలిక్కి పడింది. త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ.. చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా మహేశ్ బాబు, నవీన్ పోలిశెట్టి సహా పలువురు హీరోలు ట్వీట్లు చేశారు. చాలా మంది నటులు కూడా పోస్టులు పెడుతున్నారు.