విజయవాడలో భారీ అగ్నిప్రమాదం.. మార్కెట్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

ఆ మార్కెట్ మొత్తం వ్యాపార సముదాయాలే ఉంటాయి. అదీ చాలా దగ్గర దగ్గర ఉంటాయి. అలాంటి ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరగడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం.. మార్కెట్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

Fire Accident : విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చిట్టూరి కాంప్లెక్ లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా? లేక ఇతర కారణలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

బాగా రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ వ్యాపార సముదాయాలు ఎక్కుగా ఉన్నాయి. వాణిజ్య వ్యాపారాలు నిరంతరం కొనసాగుతుంటాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు మరింతగా వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఆ మార్కెట్ మొత్తం వ్యాపార సముదాయాలే ఉంటాయి. అదీ చాలా దగ్గర దగ్గర ఉంటాయి. అలాంటి ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరగడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.

చిట్టూరి కాంప్లెక్స్ లో.. గిఫ్ట్ ఆర్టికల్స్, ప్లాస్టిక్ సామాన్లు, బ్యాంగిల్స్ కు సంబంధించిన షాపులు ఉంటాయి. మొత్తం 2 ఫ్లోర్లు ఉంటుంది. ఏసీలో నుంచి ఫైర్ వచ్చిందని చెబుతున్నారు. ప్లాస్టిక్ సామాన్లు ఉండటంతో మంటలు అంటుకున్నాయని, మంటలు వేగంగా వ్యాపించాయని చెబుతున్నారు. మంటలు వ్యాపించడంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలను కొంతవరకు అదుపు చేయగలిగారు. సాయంత్రం సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. చిట్టూరి కాంప్లెక్స్ లో ఉన్నవన్నీ హోల్ సేల్ షాపులే. ఇతర ప్రాంతాలకు ఇక్కడి నుంచి పార్సిల్స్ వెళ్తాయి.

Also Read : హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో భారీ అగ్నిప్రమాదం