ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు?

ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

  • Published By: veegamteam ,Published On : March 11, 2020 / 07:12 AM IST
ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు?

Updated On : March 11, 2020 / 7:12 AM IST

ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెండు వారాలు నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. తాజాగా తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షల్లో యువకుడికి కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు యువకుడికి సంబంధించిన రక్తపు నమూనాలను పూణెకు పంపించినట్లు సమాచారం.

నెల్లూరులోని చిన్నబజార్ కు చెందిన యువకుడు 14 రోజుల క్రితం ఇటలీ నుంచి నెల్లూరుకు వచ్చాడు. ఈ 14 రోజుల్లో అతను చిన్న బజార్, రంగనాయకుల పేట, సంతపేటతోపాటు పలు ప్రాంతాల్లో సంచరించాడు. అలాగే అతను పలువురిని కలిసినట్లు నిన్న అధికారులు అడిగిన వాటికి సమాధానం చెప్పారు. అయితే అతను ఎవరిని కలిశారు? ఎవరెవరితో మాట్లాడాడన్న విషయాలను తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే అధికారయంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. ఏపీలో ఇప్పటివరకు కరోనా అనుమానిత కేసులు అయ్యాయి. రాత్రి లోపు పూణె నుంచి రిపోర్టు వచ్చే అవకాశం ఉంది. అయితే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ ఐతే ఏపీలో మొట్టమొదటి కరోనా కేసు అవుతుంది. జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం, వైద్య సిబ్బంది పూర్తిగా అప్రమత్తం అయ్యారు.

See Also | ప్రభుత్వాలను కూల్చటంతో బిజీగా ఉన్నబీజేపీ పెట్రోల్ ధరలు తగ్గటం గమనించలేదేమో