జగన్ కొత్త టీమ్ రెడీ అయ్యిందా? పీఏసీ సమావేశంలో ఏం జరుగుతుంది?

జగన్ చెప్పినట్లుగా పీఏసీ కమిటీ దూకుడును ప్రదర్శిస్తుందా?

జగన్ కొత్త టీమ్ రెడీ అయ్యిందా? పీఏసీ సమావేశంలో ఏం జరుగుతుంది?

Updated On : April 21, 2025 / 8:29 PM IST

జగన్ కొత్త టీమ్ రెడీ అయ్యిందా? మంగళవారం జరిగే మొదటి పీఏసీ సమావేశంలో వారితో జగన్ ఏం చర్చించబోతున్నారు.? కొత్త టీంకి ఎటువంటి బాధ్యతలు ఇవ్వబోతున్నారు? పార్టీలో సీనియర్లను పక్కనపెట్టి యంగ్ అండ్ డైనమిక్ టైంను సిద్ధం చేసుకోడానికి గల కారణాలేంటి? రేపు మంగళవారం జరిగే పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ మొదటి సమావేశంలో జగన్ ఎలాంటి పొలిటికల్ అజెండా ఫిక్స్ చేయబోతున్నారు..?

గత ఎన్నికల్లో చతికిల బడిన వైసీపీని మళ్లీ ఎలా గాడిలో పెట్టాలన్న దానిపై పార్టీ అధినేత వైఎస్ జగన్ ఫోకస్ పెట్టారంట. ఓవైపు అంశాల వారీగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే పనిలో జగన్ ఉన్నారంట. అందులో భాగంగానే పార్టీని పునర్నిమించే ఆలోచనలో ఉన్న జగన్..జిల్లా అధ్యక్షులతో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షులను గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీ నియామకాలను ఇప్పటికే పూర్తి చేశారు.

పార్టీని పటిష్టపరిచే కార్యక్రమాల్లో భాగంగా నేతల సలహాలు, సూచనలను కూడా పరిగణలోకి తీసుకొని పార్టీని ముందకు నడిపించాలన్న యోచనలో ఉన్నారట జగన్. వైసీపీ పట్ల ప్రజల్లో నమ్మకం కలిగించేలా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అంటూ వ్యూహ రచన చేస్తున్నారంట జగన్. అందులో భాగంగానే ఏప్రిల్ 22 మంగళవారంనాడు జరిగే పీఏసీ కీలక సమావేశంలో పార్టీ నేతలకు కొన్ని కీలకమైన అంశాలపై దిశానిర్దేశం చేయబోతున్నారంట.

Also Read: ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇక నుంచి మరోలెక్క.. కాంగ్రెస్ పార్టీలో గుజరాత్ మోడల్?

పార్టీని పటిష్టపరిచే కార్యక్రమంలో భాగంగా కీలకమైన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ విషయంలో కాస్తా సీరియస్ గానే కసరత్తు చేశారంట. పీఏసీలో ఈసారి కాస్త యంగ్ లీడర్స్ కి అవకాశం ఇచ్చారట జగన్. మొత్తం 33 మందితో పీఏసీని ఏర్పాటు చేసి కన్వీనర్ గా సజ్జలను నియమించారు.

యాక్టివ్‌గా ఉండే టీమ్‌ను ఎంపిక
అయితే పార్టీలో బాగా సీనియర్లుగా ఉన్న ధర్మాన ప్రసాద్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మేకపాటి రాజమోహన్ రెడ్డి వంటి వారిని వయసు దృష్ట్యా పక్కన పెట్టారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండడంతో గ్రౌండ్ లెవల్ లోనూ యాక్టివ్ గా ఉండే టీమ్ ను ఎంపిక చేశారు జగన్. రీజనల్ కోఆర్డినేటర్ లుగా ఉన్నవాళ్ళు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. ఇక జిల్లా అధ్యక్షులుగా ఉన్న వాళ్ళెవరికి పీఏసీలో అవకాశం ఇవ్వలేదు పార్టీ అధినేత జగన్.

మంగళవారంనాడు జరిగే మొదటి పీఏసీ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించబోతున్నారట. కీలకమైన అంశాలపై పోరు బాటకు దిగడంతో పాటు పొలిటికల్ గా స్పీడ్ పెంచాలని భావిస్తున్న వైసీపీ..కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వివిధ కార్యక్రమాలు రూపొందించే పనిలో నిమగ్నమైఉన్నారంట. విద్యార్థులు, మహిళలు, రైతులకు సంబంధించిన అంశాలపై ఈ కార్యక్రమాలు ఉండే అవకాశం ఉంది.

ఇచ్చిన హామీలు అమలు విషయంలోనూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా వైసీపీ కార్యాచరణ ఉండబోతుందని సమాచారం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు పార్టీని పటిష్ట పరచడంతో పాటు అన్ని విషయాల్లో కూడా రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను శ్రీకారం చుట్టబోతున్నారట. త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించలాలని భావించిన జగన్..వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అడుగులు వేయాలని బావిస్తున్నారట. మంగళవారం జరిగే పీఏసీ సమావేశంలో ఇవే విషయాలను పార్టీ నేతలకు చెప్పబోతున్నారంట.

మొత్తానికి జగన్ కొత్త పొలిటికల్ టీమ్ మొదటి సమావేశంలో ఎలా జరగబోతుంది? ఎటువంటి అంశాలపై జగన్ దిశా నిర్దేశం చేస్తారు అనేది చూడాలి. జగన్ చెప్పినట్లుగా పీఏసీ కమిటీ దూకుడును ప్రదర్శిస్తుందా? గ్రాస్ రూట్ లెవల్లో పార్టీని పటిష్టి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయనేది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.