Kiran Kumar Reddy : కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి బీజేపీలోకి మాజీ సీఎం .. ఈరోజే ముహూర్తం

కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి బీజేపీలో చేరనున్నారు మాజీ ముఖ్యమంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాయలసీమ నేత కాషాయ తీర్థం పుచ్చుకోవటానికి హస్తినకు చేరుకున్నారు.

Kiran Kumar Reddy : కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి బీజేపీలోకి మాజీ సీఎం .. ఈరోజే ముహూర్తం

Kiran Kumar Reddy join BJP

Updated On : April 7, 2023 / 11:47 AM IST

Kiran Kumar Reddy :  కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి బీజేపీలో చేరనున్నారు మాజీ ముఖ్యమంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకోవటానికి ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. శుక్రవారం (ఏప్రిల్ 7.2023) మధ్యాహ్నాం 12గంటలకు బీజేపీలో చేరటానికి ముహూర్తం ఖరాలు చేసుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఇక బీజేపీ గూటికి చేరనున్నారు. బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్టానం కీలక పదవి ఇస్తుందని ప్రచారం జరుగుతోంది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక సీఎంగా కొణిజేటి రోశయ్య సీఎం అయ్యారు. ఆ తరువాత పలు రాజకీయ పరిణమాలు కొనసాగిన క్రమంలో అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా ప్రటించింది కాంగ్రెస్ అధిష్టానం. అలా అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా పనిచేశారు. ఆయన హయాంలోనే తెలంగాణ విభజన జరిగింది. ఆతరువాత కిరణ్ కుమార్ రెడ్డి గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి రాజకీయా జీవితాన్ని ప్రారంభించాలని భావించిన ఆయన ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. బీజేపీలో చేరటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ కేంద్ర నాయకుల సమక్షంలో ఢిల్లీలో బీజేపీలో చేరనున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Nandamuri Balakrishna: సైకో ప్రభుత్వానికి చమరగీతం పాడాలి.. కులాలు, మతాల పేరుతో మీ ఓటును నాశనం చేసుకోవద్దు

తెలంగాణ రాష్ట్ర విభజన జరకుండా కిరణ్ కుమార్ రెడ్డి గట్టి ప్రయత్నాలే చేశారు. విభజన బిల్లును అసెంబ్లీలో వీగిపోయేలా చేశారు. అయినా అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పలు రాజకీయ పరిణామాల మధ్య పార్లమెంట్ తలుపులు బంధించి మరీ తెలంగాణ విభజన బిల్లును పాస్ చేయించింది. దీన్ని కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అసెంబ్లీలో ఈ బిల్లును వీగిపోయేలా చేసిన విభజనమాత్రం అధిష్టానం అభీష్టం మేరకు జరిగింది. అప్పుడు ప్రతిపక్షంగా బీజేపీ దీనికి మద్దతు పలికింది. అదికూడా రాజకీయ ఎత్తుగడలతో..

2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలుగా విడిపోయాక రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టారు. కానీ ఆ పార్టీ ఎటువంటి ఆదరణకు పొందలేదు. ఎన్నికల్లో పోటీ చేసినా డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. అప్పటినుంచి కిరణ్ కుమార్ రెడ్డి సైలెంట్ గా ఉండిపోయారు. పార్టీకి దూరంగానే ఉంటున్నారు. కానీ రాజకీయంగా మరోసారి ఎదగాలని భావించి మరికొన్ని నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగనున్న క్రమంలో బీజేపీలో చేరటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని అగ్రనేతల సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోవటానికి ఢిల్లీ చేరుకున్నారు. ఏపీలో పెద్ద ప్రభావం చూపని బీజేపీ ఎలాగైనా సీట్లు సాధించుకోవటానికి యత్నిస్తోంది. దీంట్లో భాగంగానే ముఖ్యంగా రాయలసీమలో పార్టీని బలోపేతం చేసుకోవటానికి కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటున్నట్లుగా సమాచారం.

10th Paper Leak : 10th పేపర్ లీకేజ్ కేసులో ఈటెల రాజేందర్‌కు నోటీసులు ..