భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే మాపై కేసులా.. పరిటాల శ్రీరామ్‌పై కేసెందుకు పెట్టరు..? : మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి

ప్రకాశ్ రెడ్డి విచారణ అనంతరం సీఐ శ్రీధర్ మాట్లాడారు.. హెలికాప్టర్ వద్ద జరిగిన సంఘటనలో ప్రకాశ్ రెడ్డి ఏ1గా ఉన్నారు.

భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే మాపై కేసులా.. పరిటాల శ్రీరామ్‌పై కేసెందుకు పెట్టరు..? : మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి

Former YSRCP MLA Topudurthi Prakash Reddy

Updated On : May 12, 2025 / 2:36 PM IST

Thopudurthi Prakash Reddy: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పాపిరెడ్డిపల్లెలో జరిగిన హెలికాప్టర్ ఘటన కేసుకు సంబంధించి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా సీకేపల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసుల విచారణకు హాజరయ్యారు. అయితే, ఇప్పటికే ఈ కేసులో ప్రకాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన్ వేశారు. 41ఏ నోటీసు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశించింది.

Also Read: Chandrababu: నందమూరి ఫ్యామిలీ న్యూ హీరోకి సీఎం చంద్రబాబు స్పెషల్ విషెస్.. ట్వీట్ వైరల్

పోలీసుల విచారణ ముగిసిన అనంతరం ప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. హెలికాప్టర్ వద్ద జరిగిన సంఘటనలో నా ప్రమేయం ఏమీ లేదు. నేను జనాన్ని అదుపు చేయడానికి ప్రయత్నించాను. పోలీసుల భద్రతా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నాపై కేసులు పెట్టారు. మాజీ సీఎం జగన్ కు భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. దీనిని మేము ప్రశ్నిస్తే మాపై కేసులు పెట్టారని అన్నారు.
విచారణ సందర్భంగా మొత్తం 102 ప్రశ్నలు అడిగారు. అన్నింటికీ సమాధానం చెప్పాను. పోలీసులు, కొన్ని మీడియా ఛానల్స్ లింగయ్య హత్యను పక్కదారి పట్టిస్తున్నారు. హత్యచేసిన నిందితులను పోలీసులు ఎందుకు పట్టుకోలేక పోయారని ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. హైకోర్టు 41ఏ నోటీసులు ఇచ్చి విచారించమని చెప్పింది. కానీ నన్ను అరెస్టు చేయమని, లాక్కురండి అని చెప్పారంటూ ఒక వర్గం మీడియా చెబుతోంది. అసలు లింగమయ్య హత్యకు పరిటాల శ్రీరామ్ పై ఎందుకు కేసులు పెట్టరు..? హత్య జరిగిన తరువాత శ్రీరామ్ విదేశాలకు పారిపోయాడు.. చంద్రబాబు హయాంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా అంటూ ప్రశ్నించారు.

Also Read: Jawan Murali Naik: జవాన్ మురళీ నాయక్ అంతిమయాత్రలో పాల్గొన్న పవన్ కల్యాణ్, నారా లోకేశ్.. ఫొటోలు వైరల్

సీఐ శ్రీధర్ కామెంట్స్..
ప్రకాశ్ రెడ్డి విచారణ అనంతరం సీఐ శ్రీధర్ మాట్లాడారు.. హెలికాప్టర్ వద్ద జరిగిన సంఘటనలో ప్రకాశ్ రెడ్డి ఏ1గా ఉన్నారు. ఆయన్ను 12వ తేదీలోగా విచారించాల్సి ఉంది. ఈరోజు విచారణకు హాజరయ్యారు. 102 ప్రశ్నలు అడిగాం. కొన్ని సాంకేతిక ఆధారాలతో ప్రశ్నలు అడిగాం. కొన్నింటికి సమాధానం చెప్పారు. మరికొన్నింటికి దాటవేశారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తాం. ఆరోజు జరిగిన సంఘటనపై టెక్నికల్ విచారణ చేస్తున్నాం. హెలికాప్టర్ సంస్థకు, మెయిన్ పైలెట్ కు మరోసారి నోటీసులు ఇచ్చాం. రేపు విచారించే అవకాశం ఉంది. మెయిన్ పైలెట్ వయసు రిత్యా హాజరు కాలేనన్నారు. ఆడియో కాల్ ద్వారా విచారణ చేస్తాం. మరో నెల రోజుల్లో ఈ కేసు విషయంలో ఛార్జ్ షిట్ వేస్తామని సీఐ శ్రీధర్ తెలిపారు.