Hostel Girls flees: హాస్టల్ నుంచి పరారైన నలుగురు విద్యార్థినిలు: ఇంకా లభ్యం కానీ ఆచూకీ

 తిరుపతి జిల్లా చంద్రగిరిలోని ఓ హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థినిలు పరారైన ఘటనలో యువతుల ఆచూకీ ఇంకా లభించలేదు.

Hostel Girls flees: హాస్టల్ నుంచి పరారైన నలుగురు విద్యార్థినిలు: ఇంకా లభ్యం కానీ ఆచూకీ

Chandragiri

Updated On : May 12, 2022 / 11:37 AM IST

Hostel Girls flees: తిరుపతి జిల్లా చంద్రగిరిలోని ఓ హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థినిలు పరారైన ఘటనలో యువతుల ఆచూకీ ఇంకా లభించలేదు. పోలీసులు నాలుగు రోజులుగా ముమ్మరంగా గాలిస్తున్నా యువతులు ఎక్కడున్నది తెలియరాలేదు. చంద్రగిరిలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థినులు స్థానికంగా కంచి మఠం ఆధ్వర్యంలో నడుస్తున్న సాంప్రదాయ హాస్టల్ లో ఉంటున్నారు. ఈక్రమంలో నలుగురు విద్యార్థినులు గత సోమవారం హాస్టల్ గోడదూకి పారిపోయారు. కనిపించకుండా పోయిన విద్యార్థినిలు కడపకు చెందిన ప్రశాంతి, విశాఖకు చెందిన స్రవంతి, విజయనగరంకు చెందిన శ్రీవల్లి, విజయవాడకు చెందిన వర్షిణిగా పోలీసులు గుర్తించారు.

Also read:AP politics : మంత్రి వర్గ విస్తరణ తర్వాత కొత్త బాధ్యతలతో తల పట్టుకున్న మాజీ డిప్యూటీ సీఎం

విద్యార్థినుల ఆచూకీ కోసం ఐదు ప్రత్యేక పోలీసు బృందాల ఏర్పాటు చేసిన తిరుపతి ఎస్పీ నరసప్ప అన్ని పోలీసు స్టేషన్లకు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. విద్యార్థినిల ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విద్యార్థినిలు పారిపోయిన ఘటనపై తోటి విద్యార్థినిలను అడిగి వివరాలు సేకరించారు పోలీసులు. అయితే ఎంత విచారించినా నలుగురు విద్యార్థినిలు ఎందుకు పారిపోయారు, ఎక్కడికి వెళ్లారు అనే విషయాలు అంతుబట్టకుండా ఉంది.

Also read:Fight in Petrol Bunk: పెట్రోల్ బంక్ యజమానిపై కత్తితో దాడి చేసిన యువకుడు