AP politics : మంత్రి వర్గ విస్తరణ తర్వాత కొత్త బాధ్యతలతో తల పట్టుకున్న మాజీ డిప్యూటీ సీఎం
మొన్నటిదాకా.. డిప్యూటీ సీఎం పదవి కూడా ఉండేది. కానీ.. మంత్రి వర్గ విస్తరణ తర్వాత.. మొత్తం మారిపోయింది. ఇప్పుడాయనకు కీలకమైన జిల్లా అధ్యక్షుడి బాధ్యతలను అప్పగించారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. అసలు సమస్య ఇప్పుడే మొదలైందనే చర్చ సాగుతోంది. మూడేళ్లు.. డిప్యూటీ సీఎం పదవిలో ప్రశాంతంగా గడిపిన ధర్మాన క్రిష్ణదాస్‌కి.. పక్క నియోజకవర్గాల పంచాయతీ.. పెద్ద తలనొప్పిగా మారిందనే టాక్ వినిపిస్తోంది.

AP politics : మంత్రివర్గ విస్తరణకు ముందు.. మంత్రిగా.. ప్రశాంతంగా పదవిలో కొనసాగారు. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయారు. కేబినెట్ విస్తరణ తర్వాత.. వైసీపీ బిగ్ బాస్ ఆయనకు కొత్త టాస్క్ అప్పజెప్పారు. మొన్నటిదాకా.. తన నియోజకవర్గంలో మాత్రమే చక్రం తిప్పిన లీడర్‌కు.. ఇప్పుడు పక్క సెగ్మెంట్లు.. కొత్త తలనొప్పిగా మారాయా? పదవి ఇచ్చారని సంతోష పడాలో.. లేక పంచాయతీలతో ఇబ్బంది పడాలో.. తెలియక సతమతమవుతున్నారట. ఇంతకీ.. శ్రీకాకుళంలో ఆ సీనియర్ నేతకు వచ్చిన కష్టమేంటి?
శ్రీకాకుళం జిల్లా వైసీపీలో కీలక నేతగా.. ధర్మాన క్రిష్ణదాస్‌కు పేరుంది. మొన్నటిదాకా.. డిప్యూటీ సీఎం పదవి కూడా ఉండేది. కానీ.. మంత్రి వర్గ విస్తరణ తర్వాత.. మొత్తం మారిపోయింది. ఇప్పుడాయనకు కీలకమైన జిల్లా అధ్యక్షుడి బాధ్యతలను అప్పగించారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. అసలు సమస్య ఇప్పుడే మొదలైందనే చర్చ సాగుతోంది. మూడేళ్లు.. డిప్యూటీ సీఎం పదవిలో ప్రశాంతంగా గడిపిన ధర్మాన క్రిష్ణదాస్‌కి.. పక్క నియోజకవర్గాల పంచాయతీ.. పెద్ద తలనొప్పిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. స్వయంగా.. ఆయనే జిల్లా వైసీపీలో అసంతృప్తులున్నారంటూ.. చేసిన కామెంట్స్.. పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయ్.
Also read : Telangana Congress : టీ.కాంగ్రెస్ లో మళ్లీ మొదలైన కోవర్టుల గోల..వార్నింగ్ ఇచ్చిన రాహుల్ గాంధీ
ముఖ్యంగా.. ఇచ్చాపురం, టెక్కలి, ఎచ్చెర్ల, ఆముదాలవలస, పాతపట్నంలో.. వర్గపోరు క్రిష్ణదాస్‌కి తలనొప్పిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. ఎచ్చెర్లలో.. ఎమ్మెల్యే వ్యవహారశైలి బాలేదని.. సొంత పార్టీ నేతలే అధిష్టానానికి కంప్లైంట్ చేశారు. టెక్కలిలో.. ముగ్గురు సీనియర్ల మధ్య గ్రూప్ తగాదాలు, ఆముదాలవలసలో స్పీకర్ తమ్మినేనికి వ్యతిరేకంగా.. వర్గాలుగా ఏర్పడి రోడ్డెక్కడం.. ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చగా మారింది. వీటన్నింటిని చక్కదిద్దాల్సిన బాధ్యత ధర్మాన కృష్ణదాస్‌దే అంటున్నారు వైసీపీ శ్రేణులు.
పాతపట్నంలోనూ వర్గపోరు తీవ్రస్థాయికి చేరుకుంది. ఇటీవలే జరిగిన జడ్పీటీసీ ఉపఎన్నికల్లో.. ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడిని.. వైసీపీ నేతలే ఓడించారనే టాక్ ఉంది. ఇక.. ఇచ్చాపురంలో మాజీ ఎమ్మెల్యేలు పిరియా సాయిరాజ్, నరేశ్ కుమార్ అగర్వాల్‌తో పాటు నర్తు రామారావు లాంటి కీలక నేతలు.. ఎవరికి వారు గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు. దీంతో.. గత ఎన్నికల్లో టెక్కలి, ఇచ్చాపురంలో వైసీపీ ఓటమిపాలైంది. అయినా.. ఆ నియోజకవర్గాల్లో.. వర్గాలు అలానే కంటిన్యూ అవుతున్నాయ్. ఇవన్నీ.. ధర్మాన క్రిష్ణదాస్‌కి సవాల్‌గా మారాయనే చర్చ నడుస్తోంది.
Also read : Tomato Flu Virus : కేరళలో టమాటా ఫ్లూ కలకలం..దాదాపు 10 కేసులు నమోదు
వచ్చే ఎన్నికల బాధ్యతంతా.. జిల్లా అధ్యక్షులదేనని.. అధినేత జగన్ చెప్పడం ధర్మానను మరింత కలవరపెడుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. జిల్లాలో.. గ్రూప్ పాలిటిక్స్‌కి ఎలా చెక్ పెట్టాలో తెలియక.. ఉక్కిరిబిక్కిరైపోతున్నారని.. ఆయనకు సన్నిహితంగా ఉండేవారు చెవులు కొరుక్కుంటున్నారు. జోనల్ ఇంచార్జ్.. బొత్స సాయం తీసుకొని.. ఏదో ఒకటి చేయకపోతే.. వచ్చే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని.. వైసీపీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. అయితే.. ఎన్ని ఇబ్బందులున్నా.. ధర్మాన చాలా కూల్‌గా అన్ని సెటిల్ చేస్తారనే టాక్.. పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.
- Chandrababu Naidu: కోనసీమలో చిచ్చు పెట్టింది వైసీపీనే: చంద్రబాబు
- KONASEEMA : కోనసీమలో అసలు ఏ జరిగింది..? ఏం జరగబోతోంది..? పచ్చని సీమలో చిచ్చు రగిల్చింది ఎవరు?
- Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా
- Attack On Couple: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై దాడి
- Loan App Harassment : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న లోన్‌యాప్ ఆగడాలు..బలైపోతున్న ప్రాణాలు
1BJP: మోదీ సభకు పోలీసుల ఆటంకాలు.. బీజేపీ నేతల ఆగ్రహం
2Minister Gangula Counter : ఆ కుటుంబం ఉద్యమం చేయకపోతే తెలంగాణ వచ్చేదా? ప్రధాని వ్యాఖ్యలకు గంగుల కౌంటర్
3Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
4NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
5Haridwar Superfast Express : 20 నిమిషాలు ముందే చేరుకున్న రైలు..బోగీలోంచి దిగి ప్లాట్‌ఫామ్ ప్రయాణీకులు డ్యాన్స్
6Modi Praises Bandi Sanjay : శభాష్ అంటూ బండి సంజయ్ భుజంతట్టిన ప్రధాని మోదీ
7GVL Comments: బుల్డోజర్స్ ఎత్తితేనే ఏపీలో అవినీతి నిర్మూలన: జీవీఎల్
8Amazon Discount: అమెజాన్ ఆఫర్ల వర్షం.. సెలక్టెడ్ మొబైల్స్‌పై 51% డిస్కౌంట్
9PM Narendra Modi : కుటుంబ పాలన అంటూ సీఎం కేసీఆర్ పై ప్రధాని మోడీ ఘాటు విమర్శలు..
10Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!
-
Green Tea : మధుమేహాన్ని అదుపులో ఉంచే గ్రీన్ టీ!
-
Madhuyashki Goud : రేవంత్ రెడ్డికి మధుయాష్కీ గౌడ్ బహిరంగ లేఖ..సంచలన వ్యాఖ్యలు
-
Thirumala : జీడిపప్పు బద్దల తయారీ ప్రారంభించిన టీటీడీ ఈఓ ధర్మారెడ్డి
-
Gopichand: పక్కా కమర్షియల్ నుండి మరో అప్డేట్
-
Warangal : ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం-ఆపరేషన్ కోసం తల పైభాగం తొలగింపు..అతికించకుండానే డిశ్చార్జ్