Sankranti Festival Celebrations : హౌస్ ఫుల్.. గోదావరి జిల్లాల్లోని హోటల్స్ కు ఫుల్ డిమాండ్.. పండక్కి 3 నెలల ముందే బుకింగ్స్
సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు పర్యాటకులు ఇతర దేశాల నుంచి సైతం గోదావరి జిల్లాలకు తరలి రావడంతో..

Sankranti Festival Celebrations : సంక్రాంతి సంబరాలకు అందరూ గోదావరి జిల్లాల వైపు వెళ్తుండటంతో అక్కడ సందడి నెలకొంది. కోడి పందాల కోసం ప్రముఖులు గోదావరి జిల్లాలకు క్యూ కట్టారు. దీంతో అక్కడి హోటల్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అతిథులకు, బంధువులకు ఆతిధ్యం ఇచ్చేందుకు.. స్థానిక హోటల్స్, రిసార్ట్స్, లాడ్జ్ లు సిద్ధమైపోయాయి. పండుగను పురస్కరించుకుని 3 నెలల ముందే హోటల్స్ రూమ్స్ ను ప్యాకేజీ రూపంలో అద్దెకు తీసుకున్నారు.
సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు పర్యాటకులు ఇతర దేశాల నుంచి సైతం గోదావరి జిల్లాలకు తరలి రావడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, పాలకొల్లు, నరసాపురం ప్రాంతాలలో హోటల్స్ అన్నీ కూడా హౌస్ ఫుల్ అయిపోయాయి. హోటల్స్ నిర్వాహకులు కూడా గెస్టులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హోటల్స్ అన్నీ కూడా హౌస్ ఫుల్ అయిపోయాయని చెప్పాలి. రూమ్స్ ఖాళీ లేవని నిర్వహకులు చెబుతున్నారు.
సంక్రాంతి పండక్కి గోదావరి జిల్లాలకు వచ్చే అతిథులకు గోదావరి జిల్లాల ప్రజలు ఘన స్వాగత ఏర్పాట్లు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారు బస చేసేందుకు హోటల్స్, లాడ్జ్ లు బుక్ చేశారు. దాదాపుగా అన్ని హోటళ్లు, లాడ్జీలు ఇప్పటికే హౌస్ ఫుల్ అయిన సందర్భం ఉంది. సంక్రాంతి పండుగ జరిగే 3 రోజులు.. గోదావరి జిల్లాల్లో స్టే చేసేందుకు 3 నెలల ముందు నుంచే హోటల్స్ లోని రూములన్నీ బుక్ చేసుకున్నారు. సంక్రాంతి పండుగ ఉట్టిపడేలా హోటల్స్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Also Read : తిరుపతి తొక్కిసలాట ఘటనలో బాబు క్విక్ రియాక్షన్.. బాధితుల పక్షాన నిలిచి ప్రతిపక్షానికి వాయిస్ లేకుండా ప్లాన్!