Funny Video : దండం పెడతా సార్.. నన్ను ఇంటికాడ దింపండి.. సీరియల్ చూడాలి.. నవ్వులు పూయిస్తున్న బుడ్డోడి మాటలు
బడికెళ్లిన ఓ పిల్లాడు.. ఇంటికి పంపించమని సార్ ను రిక్వెస్ట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పిల్లాడి అమాయకపు మాటలు నవ్వులు పూయిస్తున్నాయి.

Funny Video
Funny Video : చిన్న పిల్లలు అమయాకులు. తెలిసీ తెలియక వాళ్లు మాట్లాడే మాటలు నవ్వు తెప్పిస్తాయి. ఇటీవల.. తన పెన్సిల్ పోయిందని ఓ బుడ్డోడు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన వైరల్ గా మారింది. నా పెన్సిల్ ని దొంగిలించాడు.. ఈడి మీద కేసు పెట్టండి అంటూ ఆరేళ్ల పిల్లాడు చెప్పే మాటలు కడుపుబ్బా నవ్వించాయి. ఆ పిల్లాడి మాటలు, ఫిర్యాదు చేసిన తీరు చూసి అంతా సరదాగా నవ్వుకున్నారు. కర్నూలు జిల్లా పెదకడబూరుకి చెందిన హన్మంతు అనే పిల్లాడు ఆ విధంగా హైలైట్ అయ్యాడు.
అలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఇక్కడ మరో బుడ్డోడు తన అమాయకపు మాటలతో నవ్వులు పూయించాడు. స్కూల్లో టీచర్ తో ఆ పిల్లాడు జరిపిన సంభాషణ కడుపుబ్బా నవ్విస్తోంది. నీకు దండం పెడతా సార్.. నన్ను ఇంటికాడ దింపు, సీరియస్ చూడాలి.. అంటూ ఆ పిల్లాడు తన టీచర్ ని వేడుకున్న తీరు ఫుల్ కామెడీగా ఉంది.
WhatsApp Trick : ఈ ట్రిక్ తెలిస్తే.. మీ వాట్సాప్లో 256 కాంటాక్టులకు ఒకేసారి మెసేజ్ పంపొచ్చు..!
బడికెళ్లిన ఓ పిల్లాడు.. ఇంటికి పంపించమని సార్ ను రిక్వెస్ట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పిల్లాడి అమాయకపు మాటలు నవ్వులు పూయిస్తున్నాయి. లంచ్ టైమ్ లో సార్ అన్నం తింటుంటే.. ఇంటికి పంపించేయమని ఏడుపు మొదలు పెట్టాడు బుడ్డోడు. గబగబా తినేసి తనను ఇంటి దగ్గర దించేయాలని, సీరియస్ చూసే టైమ్ అయిందని గోల చేశాడు. చివరికి ప్రస్టేషన్ వచ్చి…” మీకు దండం పెడతా సార్… సీరియస్ చూడాలి, నన్ను ఇంటికాడ దింపండి’ అని ఏడుస్తూ అడుగుతుండటం నవ్వులు పూయిస్తోంది.
Omicron Third Wave : భారత్‍లో థర్డ్ వేవ్ ఖాయం..! అయినా భయపడాల్సిన అవసరం లేదట