Ganja Smuggling : తిరుపతిలో గంజాయిపై ఉక్కుపాదం

తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. ఏఎస్పీ స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. రెండు రోజులుగా వరుస దాడులు చేస్తున్నారు. ప్రత్యేకంగా శివారు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు.

Ganja Smuggling : తిరుపతిలో గంజాయిపై ఉక్కుపాదం

Tpt Ganja

Updated On : June 6, 2021 / 9:47 AM IST

Ganja Smuggling Tirupati : తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. ఏఎస్పీ స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. రెండు రోజులుగా వరుస దాడులు చేస్తున్నారు. ప్రత్యేకంగా శివారు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటి వరకు 67 మందిపై కేసులు నమోదు చేశారు. గంజాయి విక్రయిస్తున్న పలువురి అరెస్ట్ చేసి… మత్తు బానిసలకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

అరెస్ట్ అయిన వారిలో ఓ ఫిజియోథెరపీ డాక్టర్, ఎమ్మెస్సీ విద్యార్థి ఉండడం గమనార్హం. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ముడి గంజాయిని, ప్యాకెట్లుగా మార్చి నగరంలో ఇద్దరు యువకులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. తిరుపతికి గంజాయి ఎలా చేరుకుంటోందన్న అంశంపై పోలీసుల ఆరా తీశారు. ప్రధాన నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దర్యాప్తు తీరును స్వయంగా తిరుపతి ఎస్పీ అప్పలనాయుడు పర్యవేక్షిస్తున్నారు. తిరుపతిలో గంజాయి కల్చర్ పై 10tv వరుస కథనాలు ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.

Read More : Spain : తల్లిదండ్రులతో కొట్లాట.. సొరంగం నిర్మించుకున్న యువకుడు