విశాఖలోని రుషి కొండపై నిర్మాణాలను పరిశీలించి.. సంచలన విషయాలు బయటపెట్టిన గంటా శ్రీనివాసరావు

ఎన్నో ఏళ్లుగా రుషి కొండ నిర్మాణాల ఉత్కంఠ కొనసాగిందని చెప్పారు.

విశాఖలోని రుషి కొండపై నిర్మాణాలను పరిశీలించి.. సంచలన విషయాలు బయటపెట్టిన గంటా శ్రీనివాసరావు

విశాఖలోని రుషి కొండపై నిర్మాణాలను పరిశీలించారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కడి విషయాలు బయటపెట్టారు. ఎన్నో ఏళ్లుగా రుషి కొండ నిర్మాణాల ఉత్కంఠ కొనసాగిందని చెప్పారు. ఈ కట్టడాలపై ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందామని వస్తే వచ్చిన వారిపై అక్రమ కేసులు కూడా పెట్టారని తెలిపారు.

ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వాలు ఏర్పడతాయన్నారు. 2019లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. ప్రభుత్వం గురించి ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టేవారని తెలిపారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్ మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అని చెప్పారని, అధికారంలోకి వచ్చాక విశాఖలో రాజధాని, అదే విధంగా మూడు రాజధానులు అని యూ టర్న్ తీసుకున్నారని అన్నారు.

పచ్చటి టూరిజం రిసార్ట్ ను అన్యాయంగా కూల్చివేసి, విలాసవంతంగా కట్టడాలను కట్టారని తెలిపారు. రుషికొండ నిర్మాణాలపై ఆది నుంచి కూడా అన్ని వివాదాలేనని అన్నారు. పచ్చటి కొండను గుండు చేశారని తెలిపారు. ముందు టూరిజం అన్నారని, కొంతకాలం రిసార్ట్స్ అన్నారని, మరి కొంతకాలం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అన్నారని చెప్పారు.

అనుమతులు లేవని ప్రజవేదిక కూల్చారని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వం కూల్చివేసిందని తెలిపారు. కేవలం విధ్వంసం సృష్టించాలని ప్రజా వేదికను కూల్చివేశారని చెప్పారు. మూర్ఖుడు రాజు ఐతే ఇలా ఉంటుందో రాష్ట్రంలో అందరం చూశామని తెలిపారు.


NEET controversy: మరోసారి దేశాన్ని కుదిపేస్తున్న నీట్ ఇష్యూ