ఏపీ ప్రజలకు శుభవార్త.. మీరు రూపాయి కట్టాల్సిన పనిలేదు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఏపీ ప్రజలకు శుభవార్త.. మీరు రూపాయి కట్టాల్సిన పనిలేదు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

CM Chandrababu, Pawan Kalyan

Updated On : February 22, 2025 / 9:58 AM IST

Garbage Tax: కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నగరాలు, పట్టణాల్లో వసూలు చేస్తున్న ‘చెత్త’ పన్ను నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది. గత ప్రభుత్వం హయాంలో చెత్త పై పన్ను వసూళ్లు చేసిన విషయం తెలిసిందే. రూ. 187.02 కోట్ల మేర వసూలు చేసింది. అయితే, గత ఎన్నికల ప్రచార సమయంలో తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో భారీ విజయంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ‘చెత్త’ పన్ను రద్దు హామీపై దృష్టిసారించింది.

Also Read: Gossip Garage : వాడితే ఓ బాధ, వాడకపోతే మరో బాధ….! రుషికొండ భవనాలను ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది..

2021 నవంబర్ నెల నుంచి ఏపీలోని 40 పురపాలక, నగరపాలక సంస్థల్లో ప్రజల నుంచి చెత్త పన్ను వసూలును గత ప్రభుత్వం ప్రారంభించింది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొద్దిరోజులకే.. చెత్త పన్ను వసూళ్లను నిలిపివేస్తూ గతేడాది డిసెంబర్ నెలలో తీసుకొచ్చిన మున్సిపల్ చట్ట సవరణను అసెంబ్లీ ఆమోదించింది. దానికి గవర్నర్ అనుమతితో ఇటీవలే గెజిట్ విడుదలైంది. తాజాగా.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. చెత్త పన్ను వసూళ్లకు అవకాశం కల్పిస్తూ ఏపీ మున్సిపల్ చట్టం-1965లో చేర్చిన సెక్షన్ 70-బి, మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లోని సెక్షన్ 491-ఎ ను తొలగిస్తున్నట్లు నోటిఫికేషన్ లో ప్రభుత్వం పేర్కొంది.

 

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. రెండు రోజుల క్రితమే విద్యుత్‌ వినియోగదారులపై ఒక్క రూపాయి కూడా భారం వేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టారిఫ్‌ను ప్రకటించింది. అంతేకాదు, అదనపు వెసులుబాట్లుసైతం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా.. నగరాలు, పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్ను నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.