రాజమండ్రి రూరల్ అసెంబ్లీ సీటుపై టీడీపీ, జనసేన నేతల ఆశలు

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ అసెంబ్లీ సీటు తమదంటే తమదని టీడీపీ, జనసేన నాయకులు చెబుతున్నారు.

రాజమండ్రి రూరల్ అసెంబ్లీ సీటుపై టీడీపీ, జనసేన నేతల ఆశలు

Gorantla Butchaiah Chowdary, Kandula Durgesh comments on Rajahmundry rural seat

Rajahmundry Rural Assembly constituency: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ అసెంబ్లీ సీటు తమదంటే తమదని టీడీపీ, జనసేన నాయకులు చెబుతున్నారు. మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేస్తానని సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెబుతుంటే.. తనకే సీటు దక్కుతుందని తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ దీమాగా ఉన్నారు. వీరిద్దరిలో ఎవరికి సీటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే పార్టీ నిర్ణయానికి కట్టుబడతామని ఈ ఇద్దరు నాయకులు ప్రకటించారు.

పవన్ చెప్పారు.. టికెట్ నాదే: దుర్గేష్
రాజమండ్రి రూరల్ సీటు తనకే ఇస్తానని పవన్ కళ్యాణ్ హామీయిచ్చారని కందుల దుర్గేష్ తెలిపారు. ”రాజమండ్రి రూరల్ సీటును ప్రకటించాల్సింది చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్. అంతేగాని ఎవరికి వారు ప్రకటించుకోవడం సరికాదు. పవన్ కళ్యాణ్ నాకు చాలా స్పష్టంగా చెప్పారు రాజమండ్రి రూరల్ సీటు నాదేనని. కచ్చితంగా రాజమండ్రి రూరల్ సీటు నాదేనని మాకు నమ్మకం ఉంది. అంతిమ నిర్ణయం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లదే. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. వైసీపీ ప్రభుత్వంలో అధికారులు ఎవరూ వెన్నుముఖతో పనిచేయడం లేదు. పవన్ కళ్యాణ్ పర్యటనను రద్దు చేసేందుకు సహకరిస్తున్న అధికారులకు తగిన గుణపాఠం చెబుతామ”ని దుర్గేష్ పేర్కొన్నారు.

రాజమండ్రి రూరల్ సీటు నాదే: బుచ్చయ్య
రాజమండ్రి రూరల్ సీటు తనదేనని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దీమా వ్యక్తం చేశారు. జనసేన పొత్తును గౌరవిస్తానని, మిత్రపక్షాలు సీట్లు అడగడంలో తప్పేంలేదని 10టీవీతో అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి టికెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. వారి నుంచి ప్రకటన వచ్చాకే తన టికెట్ పై క్లారిటీ వస్తుంది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే తాను ప్రచారం మొదలు పెడతానని తెలిపారు.

Also Read: భీమవరంలో సొంత ఇంటికోసం పవన్ సెర్చింగ్‌.. వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకేనా!