Gossip Garage : కాకినాడ పోర్టు కబ్జా నిజమేనా? ఆ ముగ్గురిపై లుక్‌ఔట్ నోటీసులు జారీ అయ్యాయా?
మహారాష్ట్రలో దావూద్ ఇబ్రహీం లాంటి ముఠాలు ప్రజల్ని బెదిరించి, భయపెట్టి ఆస్తులు రాయించుకుంటే వాటిని సీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి.

Gossip Garage : రైస్ కదా అనుకున్నారు. మాఫియాకు అడ్డుకట్ట వేద్దామని..సీజ్ ది షిప్ అని ఆర్డర్స్ ఇచ్చేశారు. ఉక్కుపాదమే అంటూ అల్టిమేటం జారీ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు పోర్టు కబ్జా ట్రెండింగ్ టాపిక్ అవుతోంది. బియ్యం యాపారంతో మొదలై..గన్ ఎక్కు పెట్టి ఏకంగా పోర్టులోనే పాగా వేశారట. వినడానికి సినిమా స్టోరీ లాగే ఉన్నా..ఇది సీరియస్ మ్యాటర్ అంటోంది ఏపీ సర్కార్. ముంబై మాఫియాను తలపించేలా డీల్ సెట్ అయిందట. ఇదేంటి ఇంత ఘోరమా.? ఇది ప్రజాస్వామ్యమా అరాచకమా.? అధికారంలో ఉండి..అచారచక శక్తుల్లా ప్రవర్తిస్తారా అంటూ కూటమి సర్కార్ ఫైర్ అవుతోంది. ఇంతకీ పోర్టు కబ్జా నిజమేనా.? ఆ ముగ్గురిపై లుక్‌ఔట్ నోటీసులు జారీ అయ్యాయా.?
ఏకంగా కాకినాడ పోర్టునే కబ్జా పెట్టారట..!
నిజమేంటో..అబద్దమేంటో తెలియదు. ప్రచారం మాత్రం పీక్ లెవల్‌లో ఉంది. రైస్ దందా ఓవైపు..పోర్టునే కబ్జా పెట్టినట్లు చెబుతున్న మాటలు ఇంకోవైపు కాకరేపుతున్నాయి. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం దందా ఇష్యూ..తెలుగు స్టేట్స్‌లో వారం రోజులుగా వెబ్ సిరీస్‌లా కొనసాగుతోంది. మొదట కలెక్టర్ షిప్ పరిశీలన..తర్వాత పవన్ టూర్‌తో వెరీ ఇంట్రెస్టింగ్‌గా మారింది సీన్. సీజ్ ది షిప్ టాపిక్ ట్రెండింగ్‌లోకి ఉండగానే..మంత్రివర్గ ఉప సంఘం భేటీ, టాస్క్‌ఫోర్స్ కమిటీ, సీసీ కెమెరాలతో నిఘా ఇలా పోర్టునే నిఘా నీడలో పెట్టాలని ఫిక్స్ అయ్యారు. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయే స్పెషల్ సెక్యూరిటీ టీమ్‌తో భద్రతను పటిష్టం చేయాలని డిసైడ్ చేసింది ఏపీ సర్కార్. ఇంతలోనే మరో వార్త సెన్సేషన్ అవుతోంది. వైసీపీ పెద్దల డైరెక్షన్‌లో కొందరు ఏకంగా కాకినాడ పోర్టునే కబ్జా పెట్టారట.
కాకినాడ సెజ్‌లోని రూ.3,600 కోట్ల విలువైన వాటాలను లాక్కున్నారా?
కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని రూ. 3,600 కోట్ల విలువైన వాటాలను కేవీ రావు నుంచి గత ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాక్కున్నారంటూ ఓ వార్త హల్ చల్ చేస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ..కేవీ రావు ఫిర్యాదులో పేర్కొన్న వారిని కీలక నిందితులుగా భావిస్తోంది. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించారని కేవీ రావు ఫిర్యాదు చేశారట. తనను భయపెట్టి అత్యధిక షేర్లను అరబిందో సంస్థకు అప్పగించేలా చేశారనేది కేవీ రావు ప్రధాన ఆరోపణ. ఈ కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వైసీపీ ఎంపీ, మరో ముఖ్యనేత తనయుడు, ఓ పారిశ్రామికవేత్తకు ఎల్వోసీ ఇచ్చినట్లు టాక్. ఈ ముగ్గురు విదేశాలకు పారిపోకుండా దేశంలో ఉన్న అన్ని ఎయిర్‌పోర్టులకు లుక్ ఔట్ నోటీసులు పంపించారట ఏపీ సీఐడీ అధికారులు.
ఇలాంటివి దేశచరిత్రలోనే ఎప్పుడూ జరగలేదంటూ చంద్రబాబు ఆవేదన..
బియ్యం దందాపై కూపీ లాగితే డొంక మొత్తం కదిలిందట. కాకినాడ పోర్టు ఎవరి ఆధీనంలో ఉంది. ఎవరెవరికి వాటాలున్నాయని లెక్కలు తీస్తుండగా..అప్పటి ప్రభుత్వ హయాంలో జరిగిన సెటిల్‌మెంట్ కథ వెలుగులోకి వచ్చిందంటున్నారు. వ్యాపారం చేసుకునే వాళ్లను బెదిరించి..గత ప్రభుత్వ అధినేతల కనుసన్నుల్లో..తమ కావాల్సిన వారికి పోర్టులో వాటాలు దక్కేలా చేసుకున్నారని మండిపడుతున్నారు కూటమి నేతలు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని..వైసీపీ పాలకులు, వారి అండతో కొందరు గన్ను పెట్టి బెదిరించి ఆస్తులు రాయించుకున్నారని ఆరోపిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇలాంటివి దేశచరిత్రలోనే ఎప్పుడూ జరగలేదంటూ ఆఫ్ ది రికార్డులో ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.
వెలుగులోకి సెటిల్ మెంట్ ఎపిసోడ్..
మహారాష్ట్రలో దావూద్ ఇబ్రహీం లాంటి ముఠాలు ప్రజల్ని బెదిరించి, భయపెట్టి ఆస్తులు రాయించుకుంటే వాటిని సీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఆ చట్టంపై సమాచారం తెప్పించుకుంటామంటున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే భూఆక్రమణల నిరోధక చట్టం తీసుకొచ్చామన్న బాబు..కాకినాడ పోర్టు, సెజ్‌లలో బలవంతంగా వాటాలు రాయించుకున్న వ్యవహారం దీని పరిధిలోకి వస్తుందో, లేదో పరిశీలిస్తున్నారట. ఏదైనా బియ్యం దందా నుంచి స్టార్ట్ అయిన వ్యవహారం వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందనేది ఊహించని డెవలప్‌మెంట్. సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ స్టోరీలో..ఊహించని క్లైమాక్స్ రేంజ్‌లో సెటిల్‌మెంట్ ఎపిసోడ్ వెలుగులోకి రావడం పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది.
అసలు కాకినాడ పోర్టు కబ్జా నిజమా.? లేదా.?
కేవీ రావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి..ముగ్గురిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినప్పటికీ..ఈ వ్యవహారం అంతా ఎటు దారి తీస్తుందో..ఎలా విచారణ చేయాలో కూడా ఏపీ సర్కార్‌కు అంతు చిక్కడం లేదట. అసలు ఇంత దారుణంగా బిహేవ్ చేశారా అని షాక్ అయిపోతున్నారట. బాధ్యతాయుతమైన పొజిషన్‌లో ఉంటూ అడ్డూ అదుపు లేకుండా ఏంటి ఇదంతా..చెప్పుకుంటూపోతే మరో ఐదేళ్లు అరాచకం ఫైల్స్ కంటిన్యూ అవుతుందంటున్నారు కూటమి నేతలు. అసలు కాకినాడ పోర్టు కబ్జా నిజమా.? లేదా.? రైస్ మాఫియాను గెలికితేనే పోర్టు కబ్జా వ్యవహారం బయటికి వచ్చిందా.? ఇదంతా బయట జరుగుతున్న ప్రచారమేనా..నెక్స్ట్ ఇది ఎటు టర్న్ తీసుకోబోతుందనేది అయితే ఇప్పటికి ఇంట్రెస్టింగ్‌గా మారింది.
Also Read : అధికారం పోయిన 6 నెలల్లోనే.. చంద్రబాబు స్ట్రాటజీనే జగన్ ఫాలో కాబోతున్నారా?